ఐపీఎల్ మ్యాచ్‍లు ఆడటం కష్టమే.. అంత ఈజీ కాదు ఇప్పుడు : రోహిత్

1398
rohit sharma talks about playing ipl 2020 matches in uae conditions
rohit sharma talks about playing ipl 2020 matches in uae conditions

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 20 తర్వాత టోర్నీలోని ఎనిమిది జట్లు యూఏఈకి వెళ్లనున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్ 53 రోజుల పాటు జరగనుండగా.. మొత్తం 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. అయితే యూఏఈలోని అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడం కష్టమే అంటున్నారు ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెఫ్టెన్ రోహిత్ శర్మ.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ యూఏఈలో లీగ్‌ ఆడనుండటంపై స్పందించాడు. “అక్కడి అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడం సవాలే. ఇక్కడ ఉండి ఏవో వ్యూహాలు వేసుకుంటే.. మైదనాంలోకి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోవచ్చు. ఇంకో వారంలో నేను వ్యాయామం చేసే జిమ్‌ ప్రారంభం అవుతుంది. శరీర దృఢత్వ కసరత్తులు చేస్తా. ఐపీఎల్‌ ముందు ప్రాక్టీస్ విషయంలో ఏం హడావుడి పడాల్సిన పనిలేదు. నా కెరీర్ లో బ్యాట్ పట్టకుండా తీసుకున్న పెద్ద విరామం ఇదే. నా బాడీ మెరుగైన స్థితిలోనే ఉంది.

మనసు కూడా విశ్రాంతి పొందింది. మ్యాచ్ ల కోసం నేను చాలా రోజులు ఇంట్లో ఉండను. కానీ ఇప్పుడు వాళ్లతో గడిపే టైం దొరికింది. కెప్టెన్‌గా ఉన్నపుడు జట్టులో అందరికంటే తక్కువ ప్రాధాన్యమున్న వ్యక్తి మనమే అని భావించాలన్న సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. కోపాన్ని ప్రదర్శించకుండా ప్రశాంతంగా కనిపించడం అనుకుని చేసేది కాదు. కోపమొచ్చినా సహచరులపై చూపించకూడదు. భావోద్వేగాల్ని దాచుకోవడం ముఖ్యమైనది ” అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ధోనీతో నన్ను పోల్చడం నాకు నచ్చలేదు : రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ కి షాక్.. మలింగ లేడు.. ఎందుకంటే ?

సెహ్వాగ్‌ లాగా రోహిత్ రాణించగలడా ? సందేహమే : ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా తదుపరి ధోనీ రోహితే : రైనా

Loading...