హిట్‌మ్యాన్ పేరు ఎలా వచ్చిందో తెలిపిన రోహిత్..!

392
rohit sharma unveils story behind his nickname hitman
rohit sharma unveils story behind his nickname hitman

టీమిండియా స్టార్ ఓపెనర్ పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ‌ను అందరు హిట్ మ్యాన్ అంటూ పిలుస్తారన్న విషయం తెలిసిందే. అయితే తనకు ఆ పేరు ఎలా వచ్చిందో తాజాగా చెప్పాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న రోహిత్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో రోహిత్ డబుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 209 పరుగులతో భారత్ తరఫున ఈ ఘనతను అందుకున్న మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. డబుల్ సెంచరీ తర్వాత పెవిలియన్‌కు వెళ్తుంటే ఫ్లాష్ ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరారు. తర్వాత ఇస్తాను అని చెప్పాను. అందుకు అతను ఇది రికార్డు.. నువ్వు కచ్చితంగా రావాల్సిందేనన్నాడు. అక్కడే పీడీ ఉన్నాడు. నీకు తెలుసు కదా అతనెవరో.

అదే చహల్ బ్రదర్. అతను నాతో ‘నువ్వు హిట్‌మ్యాన్‌లా ఆడావు. నువ్వు హిట్ మ్యాన్‌వే’అన్నాడు. దాంతో ఆ పేరు అలా వచ్చింది.’అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ ఇప్పటివరకు 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20లు ఆడాడు. వన్డేల్లో 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో 7,119 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 14,029 పరుగులు చేశాడు.

Loading...