Saturday, April 20, 2024
- Advertisement -

కోహ్లీ-రోహిత్ సంగ‌తి తేల్చ‌నున్న బీసీసీఐ

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో విజ‌యాల‌తో టీమిండియా దూసుకెల్తున్నంత సేపు ఎవ‌వ్వ‌రూ కూడా విమ‌ర్శ‌లు చేయ‌లేదు. అయితే సెమీఫైన‌ల్లో న్యూజిలాండ్ చేతిలో కోహ్లీసేన ఓడిపోవ‌డంతో జ‌ట్టుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్‌, కోహ్లీ మ‌ధ్య ఉన్న విబేధాల వ‌ల్ల‌నె టీమిండియా స‌మిష్టిగా రాణించ‌క‌పోవ‌డంతో ఓడిపోయింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

జట్టులోని ఆటగాళ్లు కూడా కోహ్లీ వర్గం, రోహిత్ శర్మ వర్గంగా రెండుగా చీలిపోయారని, సమిష్టిగా రాణించడంలో విఫలం చెందారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ కథనాలను సీరియస్‌గా పరిగణిస్తున్న బీసీసీఐ…నిజంగానే కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయా? అన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విమ‌ర్శ‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకుంది బీసీసీఐ. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న విబేధాల‌ను తేల్చ‌క‌పోతె భ‌విష్య‌త్తులో దాని ప్ర‌భావం జ‌ట్టు మొత్తంమీద ప్ర‌భావం ప‌డుతుంద‌ని బీసీసీఐ భావిస్తోంది.

కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమైతే…ఆరంభ దశలోనే వాటిని పరిష్కరించడం మంచిదన్న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు సీనియ‌ర్లు. సెమీస్ నుంచి భారత జట్టు నిష్క్రమించిన తర్వాత భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లీని తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించాలన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని భారత జట్టు మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డారు.

విరాట్ కోహ్లీని టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కొనసాగిస్తూ…రోహిత్ శర్మకు వన్డే, ట్వంటీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అంశంపై బీసీసీఐ పరిశీలన చేసే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈవ్యాఖ్య‌ల‌పై రోహిత్‌, కోహ్లీ అభిమానుల మ‌ధ్య వార్ న‌డుస్తోంది. పరిమిత ఓవర్ల టోర్నీలకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమిస్తారన్న క‌థ‌నాల‌పై అభిమానులు రెండుగా విడిపోయారు. ఈ ప్రతిపాదనను రోహిత్ ఫ్యాన్స్ స్వాగతిస్తుండగా…కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. జట్టును సెమీస్‌ వరకు తీసుకెళ్లిన విరాట్ కోహ్లీని..పరిమిత ఓవర్లకు కెప్టెన్సీగా పరిమితం చేయాలన్న ప్రతిపాదన సరికాదంటున్నారు. కెప్టెన్సీపై బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -