టీమిండియా నెం 1 టీం.. కానీ మా సత్తా చూపుస్తాం : రాస్‌ టేలర్‌

745
ross taylor says new zealand will be a totally different opposition on home soil
ross taylor says new zealand will be a totally different opposition on home soil

ప్రపంచంలోనే టీమిండియా నంబర్‌వన్‌ టీమ్‌. కానీ భారత్‌తో జరిగే క్రికెట్‌లో సొంతగడ్దపై రెచ్చిపోతామని న్యూజిలాండ్‌ సీనియర్ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ అన్నారు. భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరగనున్నాయి. ఈ నెల 24న తొలి టీ20 మ్యాచ్‌తో పోరు మొదలవుతుంది.

మంగళవారం టీ20 మ్యాచ్‌ కోసం న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసారు. ఈ సందర్భంగా రాస్‌ టేలర్‌ పలు విషయాలపై స్పందించాడు. “ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఓడిపోయాం. కానీ ఇప్పుడు స్వదేశానికి వచ్చాం. ఇక్కడి పరిస్థితిపై పూర్తి అవగాహన ఉంది. ఇక ప్రపంచంలోనే నంబర్‌వన్‌ టీమ్‌ టీమిండియా. కానీ సొంతగడ్డపై మేం రెచ్చిపోతాం. టీమిండియా సిరీస్ విజయాలకు అడ్డుకట్ట వేస్తాం. తొలుత పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిసారిస్తాం. తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌ గురించి ఆలోచిస్తాం.

ఇక టీ20 క్రికెట్‌కు జనాల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు అన్ని జట్లూ టీ20లు ఆడుతున్నాయి. ఈ సిరీస్‌లోనే మేం ఐదు మ్యాచ్‌లు ఆడుతున్నాం. ఇది టీ20 ప్రపంచకప్‌కు ఉపయోగపడుతుంది అని టేలర్‌ అన్నారు. ఈ సిరీస్ కోసం మంగళవారం భారత క్రికెట్‌ జట్టు కివీస్‌ కు చేరుకుంది.

Loading...