Saturday, April 20, 2024
- Advertisement -

సచిన్ క్లాస్.. సెహ్వాగ్ మాస్.. అదరగొట్టారు..!

- Advertisement -

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్.. వీరిద్దరు బరిలోకి దిగారంటే బౌలర్లు చుక్కలు చూడాల్సిందే. ఇద్దరూ అవుట్ అయ్యేంత వరకూ ప్రత్యర్థి జట్టుకు తమ విజయంపై ఏ మాత్రం ఆశ ఉండేది కాదనడంలో అతిశయోక్తి లేదు. అయితే వీరిద్దరు ఆటకు దూరమై చానాళ్లైంది.

మళ్లీ ఇంతకాలానికి వీరిద్దరూ కలిసి మైదానంలో అడుగుపెట్టారు. అంతేకాదు, తమలో ఏ మాత్రమూ సత్తా తగ్గలేదని చెబుతూ విధ్వంసకర బ్యాటింగ్ ను చూపించారు. ఈ ఆటకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికైంది. సరిగ్గా 9 ఏళ్ళ నాడు ఎక్కడైతే చివరి క్రికెట్ మ్యాచ్ ని ఆడాడో.. అక్కడే సచిన్ తిరిగి బ్యాట్ పట్టాడు. తోడుగా సేహ్వాగ్ దిగాడు. ఇంకేముందు స్టేడియం మొత్తం అరుపులే. “సచిన్… సచిన్…” అంటూ మైదానంలో ప్రేక్షకులు నినాదాలు చేశారు.

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ఇండియా లెజెండ్స్‌-వెస్టిండీస్‌ లెజెండ్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ లెజండ్స్ జట్టులో చందర్ పాల్ 61 పరుగులతో రాణించడంతో, ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆపై 151 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజండ్స్ లో తొలి వికెట్ కు సచిన్, సెహ్వాగ్ కలిసి 83 పరుగులు సాధించడం గమనార్హం. సచిన్ 29 బంతుల్లోనే 7 ఫోర్లతో 36 పరుగులు చేయగా, సెహ్వాగ్ 57 బంతుల్లో 11 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. దీంతో ఇండియా లెజండ్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -