Wednesday, April 24, 2024
- Advertisement -

సచిన్ మళ్లీ బ్యాటింగ్ చేశాడు.. ఫ్యాన్స్ ఖుషి..!

- Advertisement -

సచిన్ టెండూల్కర్.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడు. ఎన్నో పరుగులు చేశారు. క్రికెట్ అంటే సచీన్ పేరే వినిపించేలా ఎన్నో మ్యాచులు ఆడాడు. సచీన్ బరిలోకి వస్తున్నాడంటే బౌలర్లకు భయం పట్టేది. అందుకే సచిన్ ను అందరు క్రికెట్ గాడ్ అని అంటూ ఉంటారు.

ప్రస్తుతం సచిన్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఇటీవల కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. వేల సంఖ్యలో మూగ జీవాలు బలయ్యాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలకు నష్టం వచ్చింది. దీంతో అక్కడి క్రికెట్ లెజెండ్స్ భాదితులకు నిధులు ఇవ్వడానికి ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ క్రిస్ట్ ఎలెవన్, పాంటింగ్ ఎలెవన్ జట్లు పోటీ పడ్డాయి.

ఈ మ్యాచ్‌లోనే సచిన్‌ కూడా మెరిశాడు. ఇన్నింగ్స్ బ్రేక్ అప్పుడు.. బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి దిగి.. ఫ్యాన్స్ ను అలరించాడు. ఆసీస్ యూనిఫాం ధరించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్.. ఫిమేల్ బౌలర్ ఎలిస్ పెర్రీ బౌలింగ్‌లో కాసేపు తన బ్యాటింగ్ విన్యాసాలతో మెస్మరైజ్ చేశాడు. గడిచిన 5 ఏళ్లలో సచిన్ బ్యాట్ పట్టడం ఇదే మొదటి సారి. ఓ మంచి కార్యక్రమంలో సచిన్ భాగమైనందుకు సంచిన్ ఓయాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -