Friday, March 29, 2024
- Advertisement -

అడ్డ‌దారులు తొక్కొద్దు…కొడుక్కి హిత‌బోధ చేసిన స‌చిన్

- Advertisement -

ప్రస్తుతం ముంబయి టీ20 లీగ్స్‌లో అకాశ్ టైగర్స్ టీమ్‌కి ఆడుతున్న అర్జున్.. బౌలింగ్, బ్యాటింగ్‌‌తో ఆల్‌రౌండర్‌గా అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. టెండుల్క‌ర్ వార‌సుడిగా భ‌విష్య‌త్తులో రాబోతున్నారు.టోర్నీలో భాగంగా శనివారం వాంఖడే వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. అర్జున్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్‌కి సచిన్ హాజరయ్యాడు. ఈ సంద‌ర్భంగా కొడుక్కి కొన్ని కీల‌క సూచ‌న‌లు చేశారు.

సచిన్ తనయుడు అర్జున్ వయసు 19 ఏళ్లు. స్వతహాగా ఆల్ రౌండర్ అయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పుడిప్పుడే ఆటలో నైపుణ్యం సాధిస్తున్నాడు. అయితే టీనేజ్ వయసుకే సచిన్ సాధించిన ఘనతలు, ప్రతిభతో అర్జున్ ను పోల్చిచూస్తున్న క్రికెట్ పండితులు మాత్రం పెదవి విరుస్తున్నారు

క్రికెట్‌పై అర్జున్ చాలా మక్కువ చూపిస్తున్నాడు. చిన్న‌ప్ప‌టినుంచి ఏవిష‌యంలోనూ బ‌ల‌వంత పెట్ట‌లేద‌న్నారు. నేను అర్జున్‌కి చెప్పేది ఒక్కటే.. ‘‘నచ్చింది చెయ్.. కానీ.. అడ్డదారుల్లో వెళ్లకు’’ అని. ఇదే మాటని నా తండ్రి (రమేశ్ టెండూల్కర్) నాకు చెప్పాడు. ఇప్పుడు అర్జున్‌కి నేను చెప్తున్నా’ అని సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు.

అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబయి టి20 క్రికెట్ లీగ్ లో పాల్గొంటున్నాడు. అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆకాశ్ టైగర్స్ జట్టు సెమీస్ కు చేరింది. ఈ సందర్భంగా కొడుకు ప్రాక్టీస్ చేస్తున్న విధానాన్ని సచిన్ దగ్గరుండి పరిశీలించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -