Friday, March 29, 2024
- Advertisement -

క్రికెట్ దేవుడు సచిన్ కూడా ఒక్క ఛాన్స్ అని బతిమాలిన వేల…

- Advertisement -

క్రికెట్ చరిత్రలో సచిన్ కున్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులు తన పేరిటి లిఖించుకున్న గొప్ప క్రికెటర్.ప్రపంచ క్రికెట్‌లో ఓపెనర్‌గా తన మార్కు ఆటను చూపించి ప్రపంచ దిగ్గజ బౌలర్లకు సైతం వణుకుపుట్టించిన దిగ్గజ ఆటగాడు. తన సుదీర్ఘ కెరీర్ లో 463 మ్యాచ్‌లు ఆడి 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడంటే అందుకు ఓపెనర్‌గా సక్సెక్‌ కావడం ప్రధానం కారణం. కాని అలాంటి సచిన్ కూడా ఒక్క ఛాన్స్ కోసం బతిమాలిన రోజు ఉందంటే నమ్ముతారా….? కాని అలాంటి రోజును సచిన్ స్వయంగా గర్తు చేసుకున్నారు.

1994లో ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌ ద్వారా ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించాడు సచిన్‌. తాను ఓపెనర్‌గా రావడానికి టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఒప్పించిన సందర్భాన్ని గుర్తు చేసున్నారు.తాను ఓపెనర్‌గా రావడానికి ఎంతగానో ప్రాధేయపడ్డానని, అదే సమయంలో మేనేజ్‌మెంట్‌తో వాదనకు దిగానని చెప్పుకొచ్చాడు. ఒక వేల రాణించకుంటే ఇంకోసారి ఓపెనింగ్ అడగనని చెప్పానని గుర్తు చేశారు. న్యూజిలాండ్ తో జరిగిన ఆమ్యాచ్ లో సచిన్ 49 మంతుల్లో 82 పరుగులు చేశారు. తర్వాత మరో అవకాశం ఇవ్వండని అడగాల్సిన అవసరం రాలేదన్నారు. ఈ మేరకు లింక్‌డిన్‌లో ఒక వీడియోను షేర్‌ చేసిన సచిన్‌.. తాము సక్సెస్‌ అవుతామనుకునే ఫీల్డ్‌లో రిస్క్‌ చేయడానికి వెనుకంజ వేయొద్దని అభిమానులకు సూచించాడు.

విఫలం అవుతామనే భయం ఎప్పటికీ వద్దు. నీవు సక్సెస్‌ అవుతాను అనుకుంటే కచ్చితంగా అందుకోసం రిస్క్‌ చేయి. రిస్క్‌ చేయపోతే ముందుకు వెళ్లడం కష్టం. అందుకు నేనొక ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -