సోషల్ మీడియాకు ధోనీ దూరంగా ఉండటానికి కారణం చెప్పిన సాక్షి..!

753
sakshi reveals why ms dhoni didn t post anything on social media during coronavirus lockdown
sakshi reveals why ms dhoni didn t post anything on social media during coronavirus lockdown

కరోనా కారణంగా క్రికెట్ ప్లేయర్స్ అంత ఇంట్లోనే ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అయితే అందరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కానీ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం సోషల్ మీడియావైపు కన్నెత్తి కూడా చూడలేదు.

అయితే ధోనీ సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని తాజాగా అతని సతీమణి సాక్షి సింగ్ వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రజెంటర్ రూఫా రమణి నిర్వహించిన లైవ్ సెషన్‌లో పాల్గొన్న సాక్షి.. ధోనీకి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన గైడ్ లైన్స్ ఫాలో కావాలని ప్రధాని మోడీ సూచించడంతోనే ధోనీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడని సాక్షి తెలిపింది. ‘కరోనాపై వీడియోలు చేయాలని ధోనీపై చాలా ఒత్తిడి చేశారు.

కానీ కరోనా నిబంధనలను పాటించాలని మోదీ పిలుపు నివ్వడంతో మహీ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. దేశంలో ప్రధానికి మించిన వారు ఎవరు లేరని భావించి సోషల్ మీడియా వేదికగా ఏం మాట్లాడలేదు.’అని స్పష్టం చేసింది. ఇక 2011 ప్రపంచకప్, 2018 ఐపీఎల్ ట్రోఫీ విజయం తర్వాత ధోనీ భావోద్వేగానికి గురయ్యాడని ధోనీ ఎప్పుడూ ఎమోషనల్‌గా ఉంటాడని ఆటపై ధోనీకి అమితమైన ప్రేమ ఉంటుంది అని సాక్షి తెలిపింది.

Loading...