Friday, April 19, 2024
- Advertisement -

టీమిండియాలో గ్యాంగ్ వార్‌..

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో విజ‌యాలు న‌మోదు చేస్తున్నంత‌సేపు టీమిండియా జ‌ట్టులోని లోపాలు బ‌య‌ట‌కు రాలేదు. కాని సెమీఫైన‌ల్లో న్యూజిలాండ్ చేతుల్లో భార‌త్ ఓడిపోవ‌డంతో జ‌ట్టులోని లోపాలు, లుక‌లుక‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా టీమిండియాలో గ్యాంగ్ వార్ జ‌ర‌గుతున్న‌ట్లు వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ప్ర‌ధానంగా ధోనిని ముందు బ్యాటింగ్‌కు పంపించ‌కుండా ఏడో బ్యాట్స్ మెన్‌గా పంప‌డంపై ఇప్పుడు చ‌ర్చ ప్ర‌ధానంగా జ‌రుగుతోంది. పంత్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపడం కోహ్లికి తెలియదని, పంత్ ఔటైన తర్వాత కోహ్లి.. కోచ్ దగ్గరికి వెళ్లి ఎవరిని అడిగి అతడిని ముందుగా పంపారు అని వాదించినట్లు తెలుస్తోంది. ఇద‌లా ఉంటె జట్టులో కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లి, రోహిత్ మధ్య గ్యాంగ్ వార్ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం జట్టులో కోహ్లి మాటే శాసనంగా ఉన్నందున తనకు నచ్చిన వారికే అవకాశాలు ఇస్తున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి. సీవోఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ అండదండలు కూడా ఉండటంతో కోహ్లి నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయలేక పోతున్నార‌నె టాక్ వినిపిస్తోంది.

విఫ‌లం అవుతున్న రాహుల్‌ను జ‌ట్టులో అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని దానికి కార‌ణం కోహ్లీకి స‌న్నిహితుడు కాబ‌ట్టే అన్న వాద‌న వినిపిస్తోంది.ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టులో కోహ్లి సహచరుడు అయినందువల్లే చాహల్‌ జాతీయ జట్టులో కొనసాగుతున్నాడని ఓ క్రికెటర్ ఆక్రోశం వ్యక్తం చేసినట్లు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాయుడిని కాదని విజయ్ శంకర్‌ను తీసుకున్నప్పుడే టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాయుడికి జరిగిన అన్యాయానికి గ్యాంగ్ వారే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై కోహ్లి, రోహిత్, రవిశాస్త్రి ఎలా స్పందిస్తారో చూడాలి. నిజంగానే టీమిండియా కోహ్లి వర్సెస్ రోహిత్‌‌గా మారిందా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -