Friday, April 19, 2024
- Advertisement -

కోహ్లీ వేదాంతం విన్నారా….!

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్లో భార‌త్ న్యూజిలాండ్ చేతుల్లో ఓడి ఇంటి ముఖం ప‌ట్ట‌డంతో జ‌ట్టుపై తీవ్ర‌విర్శ‌లు చెల‌రేగాయి. పేవ‌ల బ్యాటింగ్‌తో క‌ప్ గెలిచే అవ‌కాశం పోగొట్టుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌ని టీమిండియా కెప్టెన్ కోహ్లీ విండీస్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరేముందు వేదాంతం మొద‌లు పెట్టారు.

తన జీవితంలో చాలా విషయాల్ని వైఫల్యాలు, ఎదురుదెబ్బల నుంచే నేర్చుకున్నానన్నాడు. తనకు తగిలిన ఎదురుదెబ్బలు తనను విజయం వైపు ప్రేరేపించాయన్నాడు. ఒక వ్యక్తిగా తనను మెరుగుపర్చాయన్నాడు విరాట్.మనం బాగా ఎదుగుతున్న సమయంలో అకస్మాత్తుగా మనతో జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని కుంగదీస్తాయి. ప్రతీ ఒకరు బాగా ఆడుతున్నా మనం ఆడలేకపోతాం. మనం ఏ తప్పు చేయలేదని మనకు తెలుస్తోంది.

విండీస్ టూర్ కు వెల్లే జ‌ట్టులో యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం క‌ల్పించారు సెల‌క్ట‌ర్లు. దీనిపై కూడా స్పందించారు కోహ్లీ. తాజాగా టీంలోకి వచ్చిన రిషబ్ పంత్, శుబ్మాన్ గిల్ ,శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నార‌ని కితాబిచ్చారు. ఐపీఎల్ టోర్న‌మెంట్‌ల వ‌ల్ల వాళ్ల నైపుణ్యాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌న్నారు. టీంలో ఉన్న వ్యక్తలు సంఖ్యను బట్టి మ్యాచ్ విన్నింగ్ సామర్ద్యాల్ని గతంలో కూడా ఎప్పుడు అంచనా వేయలేదన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -