జిమ్‌లో చెమ‌టోడుస్తున్న శిఖ‌ర్ ధావ‌న్‌..

240
Shikhar Dhawan thanks fans for recovery wishes
Shikhar Dhawan thanks fans for recovery wishes

టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎడమచేతి బొటనవేలికి గాయమైన ధావన్‌కు మూడు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో ప్రపంచకప్‌లో అతడి స్థానంపై సందిగ్ధత నెలకొంది. అయితే జ‌ట్టులోకి వ‌చ్చేందుకు ధావ‌ణ్ జిమ్‌లో తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

బుధవారం తన గాయంపై శిఖర్‌ ధావన్‌ తన ప్రతిస్పందనను కవితా రూపంలో ఇప్ప‌టికే వెల్లడించాడు. ప్రఖ్యాత ఉర్దూ రచయిత రాహత్‌ ఇందోరీ రాసిన పంక్తిని అతను ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. తాజాగా జట్టులోకి రావాడానికి జిమ్‌లో తాను చేస్తున్న కసరత్తులను ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు.

‘ప్రస్తుత పరిస్థితులు ఓ పీడకలగా మిగిలిపోవచ్చు లేకుంటే తిరిగి కోలుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు. నేను కోలుకోవాలని సందేశాలను పంపించిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. చేతికి పట్టీ వేసుకొని మరి గబ్బర్‌ కసరత్తు చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ వారు కామెంట్‌ చేస్తున్నారు.

Loading...