శివమ్ దూబేని మూడో స్థానంలో పంపడం వెనక కారణం ఇదే..!

791
Shivam Dube Shines At Number 3
Shivam Dube Shines At Number 3

తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో ఆల్ రౌండర్ శివమ్ దూబేని బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో దిగాడు. అయితే ఇలా ఎందుకు చేయవల్సి వచ్చిందో కోహ్లీ తెలిపాడు.

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. “స్పిన్నర్లకు పిచ్ అనుకూలిస్తోందని.. బ్యాటింగ్ ఆర్డర్ లో దూబే ముందుకు వెళ్లి స్పిన్నర్లపై దాడి దిగాలని భావించాం. అందుకే అతడిని మూడో స్థానంలో బరిలోకి దింపాం. మేము అనుకున్నట్లుగానే అతను బాగా ఆడటం వల్ల మంచి స్కోరు చేయగలిగాం” అని చెప్పాడు.

గత రెండు మ్యాచుల్లో ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. కచ్చితంగా మెరుగుపడాలి. తొలి టీ20లో ఒక క్యాచ్‌ను ఒంటి చేత్తో ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. ఈ సారి రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నా అని కోహ్లీ తెలిపాడు. చివరి నాలుగు ఓవర్లలో మా బ్యాటింగ్ బాగాలేదు.

కాస్త ఎక్కువ పరుగులు చేసి ఉంటే బాగుండేది. ఈ అంశంపై దృష్టి సారిస్తాం. ఇక మూడో మ్యాచ్ లో వంద శాతం పోరాడుతాం అని కోహ్లీ తెలిపాడు. ఇక శివమ్ దూబే (54; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టీ20ల్లో శివమ్ దూబేకి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

Loading...