Friday, April 19, 2024
- Advertisement -

పాక్ బౌల‌ర్ అమీర్ నిర్ణ‌యంపై ఫైర్ అయిన పాక్ మాజీ క్రికెట‌ర్లు…

- Advertisement -

టెస్ట్‌ల‌కు గుడ్‌బై చెప్పిన పాక్ పాస్ట్ బౌల‌ర్ అమీర్ నిర్ణ‌యంపై ఆదేశ సీనియ‌ర్ క్రికెట‌ర్లు గ‌రంగ‌రం అవుతున్నారు. సోయ‌బ్ అక్త‌ర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. టెస్టు ఫార్మాట్‌ను వదిలి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవుతానంటూ ఆమిర్‌ పేర్కొనడం అక్తర్‌కు తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అసలు మీలాంటి వాళ్లను ఏ ఫార్మాట్‌లోనూ క్రికెట్‌ ఆడకుండా చేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఒక వేల నేను సెక‌క్ష‌న్ క‌మిటీలో ఉంటె ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకొనే క్రికెట‌ర్ల‌ను ఏ ఫార్మెట్‌లోనూ ఆడించేవాడిని కాదంటూ నిప్పులు చెరిగారు. టెస్ట్‌ల్లో పాక్ అంతంత మాత్రంగానె ఉంద‌ని ఇలాంటి స‌మ‌యంలో దేశానికి ఇచ్చేది ఇదేనా. నువ్వు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంలో చిక్కుకున‍్నప్పుడు పాకిస్తాన్‌ క్రికెట్‌ చాలా ఖర్చు పెట్టింది. నీకు ఎన్నో చాన్స్‌లు ఇచ్చి రాటుదేలేలా చేసిందంటూ ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు.

మ‌రో వైపు అమీర్ నిర్ణ‌యంపై వ‌సీం అక్ర‌మ్ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమీర్ నిర్ణ‌యం తొంద‌ర‌పాటు చ‌ర్య అని అన్నారు. టెస్టు ఫార్మాట్‌లో పాక్‌ జట్టుకు ఆమిర్‌ అవసరం చాలా ఉందన్నాడు. ‘మహ్మద్‌ ఆమిర్‌ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే 28 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో గొప్ప ఫార్మాట్‌ అయిన టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పడం. పైగా పాకిస్తాన్‌ జట్టుకు అతని అవసరం ఎంతో ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలోని రెండు టెస్ట్‌లు, ఇంగ్లండ్‌లో మూడు టెస్ట్‌లకు జట్టులో అతను ఉండటం ముఖ్యం’ అని వసీం ట్వీట్‌ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -