Tuesday, April 23, 2024
- Advertisement -

పాకిస్తాన్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీలా ఆడాలి : షోయబ్‌ అక్తర్‌

- Advertisement -

కెప్టెన్‌ విరాట్‌ గురించి పాకిస్తాన్ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీలా ఆడాలి. కోహ్లీని కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌, కెప్టెన్‌ అజర్‌ అలీలు అనుసరించి పాక్ జట్టును టీమిండియా కంటే ఉత్తమ జట్టుగా మార్చాలి ఆయన అన్నారు.

“భారత్‌ చాలా మెరుగయింది. ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు. కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్‌ కూడా దూకుడుగా ఆడే ఆటగాళ్లను కలిగి ఉంది. అయితే వారిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతోంది. గతంలో పాక్ ఎంతో దూకుడుగా ఆడేది” అని గుర్తు చేసాడు. ’కోహ్లీ శారీరకంగా చాలా దృఢంగా ఉంటాడు. అతన్ని అనుసరిస్తున్న టీమిండియా ఆటగాళ్లు అలాగే కనిపిస్తారు. ఒక కెప్టెన్‌ బాధ్యతగా ఉండి ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తే ఆ జట్టు ఆటగాళ్లు కూడా కచ్చితంగా అతడిని అనుసరిస్తారు. కోహ్లీనే ఇక్కడ ఓ ఉదాహరణ’అని అక్తర్‌ తెలిపాడు.

‘ప్రస్తుతం పాకిస్థాన్‌ భయపడకుండా ఆడాల్సిన అవసరం ఉంది. ఆటగాళ్లలో సోదర భావం ఏర్పడాలి. కెప్టెన్, కోచ్ ఆటగాళ్లు అందరూ పూర్తి ఫిట్‌గా ఉండేలా చూడాలి. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్ మంచి ప్రదర్శన చేసింది. చాలా ఏళ్ల తర్వాత సొంత గడ్డపై సిరీస్ గెలిచాం. ఆనందంగా ఉంది. పాక్ భవిష్యత్‌లోనూ ఇలాంటి ఫలితాలే రాబట్టాలి’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -