Friday, April 26, 2024
- Advertisement -

ధోనీని ఇబ్బంది పెట్టాలనే బీమర్ వేశా : అక్తర్

- Advertisement -

2006 పైసలాబాద్ టెస్టులో.. టీమిండియా మాజీ కెఫ్టేన్ మహేంద్రసింగ్ ధోనీని కావాలనే గాయపర్చాలని తాను బీమర్ ని సంధించినట్లు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తాజాగా ఒప్పుకున్నాడు.

తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు, ఆటగాళ్ల మధ్య సన్నిహితం గురించి సుధీర్ఘంగా మాట్లాడిన అక్తర్.. ధోనీని ఇబ్బంది పెట్టాలని.. ఆ టెస్టు మ్యాచ్ లో తాను బీమర్ ని సంధించినట్లు తెలిపాడు. ఆ మ్యాచ్ లో షోయబ్ అక్తర్ వేసిన ఓ ఓవర్ లో ధోనీ మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో అక్తర్ ఆగ్రహానికి లోనై.. ప్రమాదకరరీతిలో బీమర్ విసారాడు. కానీ.. అది ధోనికి దూరంగా వైడ్ రూపంలో వెళ్లడంతో ప్రమాదం తప్పింది.

ఆ బంతి గురించి అక్తర్ మాట్లాడుతూ.. “పైసలాబాద్ టెస్టులో 8-9 ఓవర్ల వేశాను. ఆ మ్యాచ్ లో ధోనీ సెంచరీ చేశాడు. నా బౌలింగ్ లో దూకుడుగా ఆడాడు. దాంతో కావాలనే అతడిని ఇబ్బంది పెట్టాలని బీమర్‌ని సంధించా. కానీ.. ఆ తర్వాత అతనికి సారీ చెప్పాను. నా లైఫ్ లో కావాలనే బీమర్ వేయడమనేది అదే ఫస్ట్ టైమ్. వరుసగా బౌండరీలతో సహనం కోల్పోయి.. క్షణికావేశంలో ఆ బంతిని వేయాల్సి వచ్చింది. దానిపై ఇప్పటికీ చింతిస్తున్నా’’ అని అక్తర్ వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లని ఉతికారేసిన మహేంద్రసింగ్ ధోనీ (148: 153 బంతుల్లో 19×4, 4×6) మెరుపు శతకం బాదేశాడు. అయితే.. ఆఖరికి ఈ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఐపీఎల్ మ్యాచ్‍లు ఆడటం కష్టమే.. అంత ఈజీ కాదు ఇప్పుడు : రోహిత్

ధోనీతో నన్ను పోల్చడం నాకు నచ్చలేదు : రోహిత్ శర్మ

టీమిండియా తదుపరి ధోనీ రోహితే : రైనా

ముంబై ఇండియన్స్ కి షాక్.. మలింగ లేడు.. ఎందుకంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -