సచిన్ గాయం తెలిసే బౌన్సర్లు వేశాను : షోయబ్ అక్తర్

731
shoaib Akhtar Reveals Why He Targeted Sachin With A Barrage Of Bouncers
shoaib Akhtar Reveals Why He Targeted Sachin With A Barrage Of Bouncers

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 2004-05లోనే మోచేతి గాయం కారణంగా కెరీర్‌కి వీడ్కోలు చెప్పేలా కనిపించాడు. అప్పట్లో సచిన్ ఆ గాయం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాడు. కానీ పట్టుదలతో సచిన్ ఆ గాయం నుంచి కోలుకుని కమ్ బ్యాక్ ఇచ్చాడు. 2013 వరకూ కెరీర్‌ని దిగ్విజయంగా కొనసాగించాడు. అయితే సచిన్ మోచేతి గాయంతో ఇబ్బంది పడే రోజుల్లో తాను ఉద్దేశపూర్వకంగానే బౌన్సర్లని సంధించినట్లు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్టర్ తాజాగా వెల్లడించాడు.

2006లో అప్పుడప్పుడే మోచేతి గాయం నుంచి సచిన్ కోలుకున్నాడు. దాంతో.. సచిన్‌ని నియంత్రించడానికి తాను బౌన్సర్ బంతుల్ని ఆశ్రయించినట్లు అక్తర్ చెప్పుకొచ్చాడు. “సచిన్‌కి టెన్నిస్ ఎల్బో గాయం ఉందని నాకు తెలుసు. అందుకే.. ఆ టూర్‌లో అతడ్ని నియంత్రించేందుకు నేను వరుస బౌన్సర్లని సంధించాను. దాంతో.. గాయం మళ్లీ తిరగబడుతుందేమోనని సచిన్ ఆ బౌన్సర్లని హుక్ లేదా ఫుల్ చేయలేకపోయాడు’’ అని అక్తర్ వెల్లడించాడు.

అయితే నిజానికి అప్పటికే షోయబ్ అక్తర్ బౌలింగ్‌ని సచిన్ టెండూల్కర్ ఉతికారేశాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో అక్తర్ విసిరిన బౌన్సర్ బంతిని అప్పర్ కట్ రూపంలో కళ్లుచెదిరే సిక్స్ బాదిన సచిన్.. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికీ సచిన్, అక్తర్ మధ్య ఆధిపత్య పోరు గురించి ప్రస్తావన వస్తే..? ఆ సిక్సర్‌ గురించే చెప్తుంటారు.

Loading...