Friday, April 19, 2024
- Advertisement -

మేము బెస్ట్ ఫ్రెండ్స్.. కానీ అక్కడ శత్రువులం : అక్తర్

- Advertisement -

టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీ తనకు మంచి ఫ్రెండ్ అని.. కాని మైదనంలో మాత్రం శత్రువులమని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. తాజాగా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్‌ఫో‌ హోస్ట్‌గా సంజయ్‌ మంజ్రేకర్‌ నిర్వహించిన లైవ్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు షోయబ్. ’కోహ్లీ, నేను మంచి స్నేహితూలం. కానీ మైదనంలో మాత్రం శుత్రువులం అవుతాం.

మీమిద్దరం పంజాబీలం కావడం వల్ల మా స్వభావం ఒకే విధంగా ఉంటాయి. అతడు నాకన్నా జూనీయర్. కానీ కోహ్లీని నేను గౌరవిస్తా. కోహ్లీ ఈ తరం బ్రాడ్‌మన్‌. అతడిని ఔట్‌ చేయడం చాలా కష్టం.’ అని అక్తర్ పేర్కొన్నాడు. ఆసియా కప్‌-2010లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ జరగ్గా.. ఆ మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడారు. కానీ అక్టర్ బౌలింగ్ లో ఆడే చాన్స్ కోహ్లీకి రాలేదు.

ఆ రోజు విరాట్ 18 బంతుల్లో 27 పరుగులు చేసిన అనంతరం పాక్‌ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అంతకుముందు ఓ లైవ్ సెషన్‌లో కోహ్లీ, సచిన్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని ఓ అభిమాని అక్తర్‌ను ప్రశ్నించగా.. సచిన్-కోహ్లీ మధ్య పోలిక తేవడం సరైంది కాదు అక్తర్ అన్నాడు. ఇక కోహ్లీ సచిన్ 100 సెంచరీల రికార్డును సులువుగా బ్రేక్ చేస్తాడని అక్తర్ జోస్యం చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -