కోహ్లీ చెప్పినట్లే చేశాను.. అందుకే అలా ఆడాను : శ్రేయాస్‌ అయ్యర్‌

923
shreyas iyer says performing against best bowling attack gives you confidence
shreyas iyer says performing against best bowling attack gives you confidence

ఆస్ట్రేలియా బౌలర్లు బౌన్సర్లతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ముందు క్రీజులో నిలబడ్డానికి ప్రయత్నించాను.. తర్వాత మా సత్తా చూపించాం అని టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. సంయమనం పాటించి నా ప్రణాళికను అమలు చేశా అని యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌ తెలిపాడు.

ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదికగా జరిగిన వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. బెంగళూరు వన్డేలో శ్రేయాస్‌ అయ్యర్‌ (35 బంతుల్లో 44: 6 ఫోర్లు, 1 సిక్సర్‌) అద్భుతంగా ప్రదర్శన కనబరిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అయ్యర్‌ మాట్లాడుతూ.. “ఆస్ట్రేలియా బౌలింగ్ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అసీస్ లో స్టార్క్, కమిన్స్, హేజిలీవుడ్ లాంటి స్టార్ పేసర్లు ఉన్నారు. ఇప్పటివరకు నేను ఆడిన మ్యాచుల్లో అసీస్ బౌలింగ్ బలంగా ఉంది.

అలాంటి జట్టుపై మన సత్తా చూపిస్తే సంతృప్తిగా ఉంటుంది. ఇలాంటి మ్యాచ్ అడటం వల్ల నాలో విశ్వాసం పెరిగింది. రోహిత్ పెవిలియన్ చేరాక క్రీజులోకి వచ్చాను. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో నిలబడాలని నిర్ణయించుకున్నా. అయితే ఆసీస్ బౌలర్లు బౌన్సర్లు విసిరి నన్ను కవ్వించాలని చుశారు. నా తలపైకి వచ్చే బౌన్సర్లు వేశారు. షాట్లు ఆడుతా అని కోహ్లీతో అన్నాను. ముందు క్రీజులో కుదురుకోవడానికి ట్రై చేయమని కెఫ్టెన్ చెప్పాడు. దాంతో సంయమనం పాటించి.. నా ప్రణాళికను అమలు చేశా.. తర్వాత భారీ షాట్లు ఆడా’’ అని అయ్యర్‌ చెప్పుకొచ్చాడు.

Loading...