Saturday, April 20, 2024
- Advertisement -

టీమిండియా కోచ్ ర‌విశాస్త్రిపై మాజీ కెప్టెన్ గంగూలి ఫైర్‌

- Advertisement -

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ ఉండగానే కోల్పోవడంపై భారత క్రికెట్‌ జట్టు ప్రదర్శనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ‌ట్టు ఓట‌మికి ర‌విశాస్త్రి, సంజ‌య్ భంగ‌ర్‌లే బాధ్య‌త వ‌హించాల‌ని మాజీ కెప్టెన్ గంగూలి విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.

ఐదు టెస్టుల ఈ సిరీస్‌ని ఒక టెస్టు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్‌ జట్టు 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆదివారం ముగిసిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో 245 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు పేలవ రీతిలో 184 పరుగులకే కుప్పకూలిపోయింది.

ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కోహ్లి మాత్రమే రాణిస్తున్నాడు. జట్టులో మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి..? వాళ్లు ఎందుకు బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్నారు..? ఈ ప్రశ్నకి సరైన సమాధానం దొరక్కపోతే.. భారత్ జట్టు ఎప్పటికీ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లను గెలవలేదంటూ వ్యాఖ్య‌లు చేశారు. కోహ్లీ మాత్ర‌మే రాణిస్తున్నాడ‌ని, మిగితా వారిలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపాల్సిన బాధ్య‌త కోచ్‌ల‌దేన‌న్నారు.

గతంలో పుజారా, రహానె బాగా ఆడారు. కానీ.. ఈ సిరీస్‌లో వాళ్లు కూడా ఒత్తిడిలోనే కనిపిస్తున్నారు. ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత కోచ్‌లది. కానీ.. వారు విఫలమయ్యారు. కాబట్టి.. తాజా టెస్టు సిరీస్‌ ఓటమికి వారు బాధ్యత వహించాలి’ అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -