ధోనీని నేను అభిమానించడానికి ముఖ్యకారణం ఇదే : గంగూలీ

1697
sourav ganguly says happy that indian cricket got mahendra singh dhoni
sourav ganguly says happy that indian cricket got mahendra singh dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో ఒత్తిడిని అధగమించే తీరే అతన్ని అభిమానించేలా చేసిందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ధోనీ గొప్ప ఆటగాడని.. అలాంటి ఆటగాడు దొరకడం తనకు చాలా సంతోషపరించిందన్నాడు. ఇటీవల భారత యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌తో మాట్లాడిన దాదా.. ఈ సందర్భంగా ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు.

మహీ బర్త్‌డే నేపథ్యంలో ఈ వీడియోను బీసీసీఐ మంగళవారం ట్వీట్ చేసింది. ” 2004లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన సిరీస్‌లో ధోనీని ఎంపిక చేయాల‌ని సెలెక్ట‌ర్ల‌ను కోరాను. కానీ ఒక కెఫ్టెన్ గా నేను జట్టును మాత్రమే ఏంచుకోగలను. నేను జట్టులోకి ధోనీ తీసుకున్నప్పటికి మ్యాచ్ లో విఫలయ్యాడు. కానీ అతని ఆటతీరుపై నాకు నమ్మకం ఉంది. వికెట్ కీపర్ గా జట్టులోకి వచ్చిన ధోనీ.. పాక్ తో జరిగిన రెండో వన్డేకు రాహుల్ ద్రవీడ్ ను కాదని నెంబ‌ర్ 3 స్థానంలో ధోనీని పంపాల‌ని నిర్ణ‌యించుకున్నా. స‌రిగ్గా ఇదే మ్యాచ్‌లో ధోనీ త‌న ఆట‌తీరు ఎలా ఉంటుందో మొద‌టిసారి ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాడు.

ఇక అక్క‌డినుంచి వెనుతిరిగి చూడాల్సిన అవ‌స‌రం రాలేదు. ప్ర‌పంచ క్రికెట్‌లో అత‌నొక అత్యుత్త‌మ ఆట‌గాడే కాదు.. మంచి ఫినిష‌ర్ కూడా. ఎన్నో మ్యాచ్‌ల్లో ఫినిష‌ర్‌గా వ‌చ్చి లోయర్ ఆర్డ‌ర్ సాయంతో జ‌ట్టును గెలిపించిన తీరుపై ఇప్ప‌టికి మాట్లాడుతూనే ఉంటారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం కొత్త ఆట‌గాళ్లు క్రికెట్‌లో ప‌రిచ‌యం అవుతుంటారు. కానీ ఒక ద‌శాబ్ధంలో కొంద‌రే క్రికెటర్లు త‌మ‌దైన ముద్ర వేస్తారు. అందులో ధోనీకి కూడా స్థానం ఉంద‌నడంలో సందేహం లేదు. ఓట‌మి అంచుల్లో ఉన్న‌ప్పుడు ఆట‌గాళ్లు ఒత్తిడికి లోన‌వుతుంటారు. కానీ ధోనీ మాత్రం ఒత్తిడిని జ‌యించి ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించాడు. అదే ఎంఎస్ ధోనీ ప్ర‌త్యేక‌త‌.. అందుకే నేను మహీకి ప్రియ‌మైన అభిమానిగా మారిపోయాను” అని గంగూలీ తెలిపాడు.

కోహ్లీ కంటే రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్ : కృష్ణప్ప గౌతమ్

బుమ్రా నోబాల్‌ కారణంగా పాక్ తో భారత్‌ ఓడిపోయింది : భువనేశ్వర్

భారత గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌ రాహుల్ ద్రవిడ్..!

కోహ్లీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎందుకు తీసుకోలేదో తెలుసా ?

Loading...