Friday, April 19, 2024
- Advertisement -

రిటైర్మెంట్‌ మ్యాచ్‌లో ధోనీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు : గంగూలీ

- Advertisement -

తనకి రిటైర్మెంట్ మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోనీ ఊహించని సర్ ఫ్రైజ్ ఇచ్చినట్లు మాజీ కెఫ్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. 2008లో నాగ్‌పూర్ వేదికగా ఆసీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి గంగూలీ రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆ మ్యాచ్‌ ఆఖర్లో 3-4 ఓవర్లు కెప్టెన్సీ చేయాల్సిందిగా ధోనీ కోరినట్లు గంగూలీ వెల్లడించాడు.

ఆ మ్యాచ్ లో భారత్ 172 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. రిటైర్మెంట్ మ్యాచ్‌ గురించి తాజాగా ఓపెనర్ మయాంక్ అగర్వాత్‌తో ‘ఓపెన్ నెట్స్ విత్ మయాంక్’ ఛాట్ షోలో గంగూలీ మాట్లాడుతూ .. “నా చివరి టెస్టు మ్యాచ్ నాగ్ పూర్ లో ఆడాను. ఆ రోజు మ్యాచ్ లో ఆఖరి రోజు.. లాస్ట్ సెషన్. గార్డ్ హాఫ్ హానర్‌తో నా సహచరులు మైదానంలోకి నన్ను ఆహ్వానించారు. ఆ సెషన్ ఆఖర్లో కెప్టెన్ ధోనీ.. నన్ను కెప్టెన్‌గా జట్టుని నడిపించమని కోరాడు. నేను ఆ సర్‌ప్రైజ్‌ని ఊహించలేదు. ఆ మ్యాచ్‌లో భారత్ జట్టు గెలిచింది. కానీ.. నా మైండ్‌ మొత్తం రిటైర్మెంట్‌ ఆలోచనలతో నిండిపోయింది. కాబట్టి.. ఆ ఆఖరి 3-4 ఓవర్లలో కెప్టెన్‌గా ఎలా వ్యవహరించానో నాకు గుర్తులేదు’’ అని గంగూలీ వెల్లడించాడు.

భారత్ జట్టుకి దూకుడు నేర్పిన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు గంగూలీ. అతని కెప్టెన్సీలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. అయినప్పటికీ.. ధోనీకి వరుస అవకాశాలిచ్చిన గంగూలీ.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.3లో పంపి మరీ ప్రోత్సహించాడు. దాంతో.. ధోనీ కూడా గంగూలీపై తన గౌరవాన్ని చాటుకున్నాడు.

ధోనీకి ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదట..!

అక్తర్ బౌలింగ్‌కి సచిన్ భయపడ్డాడు.. నేను చూశా : అఫ్రిది

వన్డేల్లో సచిన్ మొదటి బంతిని ఎదుర్కోడు : గంగూలీ

ధోనీని నేను అభిమానించడానికి ముఖ్యకారణం ఇదే : గంగూలీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -