Friday, April 26, 2024
- Advertisement -

భారత్ పై మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రి…

- Advertisement -

పాకిస్థాన్ సైన్స్ మంత్రి పవాద్ చౌదరి మరో సారి ఇండియాపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ 2 పై కారుకూతలు కూసిన మంత్రి ఈ సారి బీసీసీఐపై చిల్లర వ్యాఖ్యలు చేశారు. పాక్ పర్యటనకు శ్రీలంక ఆటగాళ్లు విముఖత చూపించారు. జట్టులోని పది మంది ఆటగాళ్లు పాక్ వెల్లమని ఆ దేశ క్రికెట్ బోర్డుకు తేల్చి చెప్పారు.

లంక ఆటగాళ్లు పాక్ పర్యటనను వ్యతిరేకించడానకి కారణం భారత్ బెదిరింపులేనని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్‌లో మిలెటంట్లు దాడి చేయగా.. లంక క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇక అప్పటి నుంచి పాక్‌ గడ్డపై మ్యాచ్‌లు ఆడేందుకు ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టూ సాహసించడం లేదన్న సంగతి తెలిసిందే.

ఈనెల 27 నుంచి కరాచీ వేదికగా మూడు వన్డేలు, లాహోర్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేలా షెడ్యూల్ రూపొందించింది. కానీ.. పాక్‌లో పర్యటించేందుకు శ్రీలంక సీనియర్ క్రికెటర్లు విముఖత ప్రదర్శిస్తున్నారు. పాక్ లో పర్యటిస్తే ఐపీఎల్ లో ఆడించబోమని శ్రీలంక క్రికెటర్లని భారత్ బెదిరిస్తోందంటూ ఆరోపనలు చేశారు.

పాకిస్థాన్‌ పర్యటనని వ్యతిరేకించకపోవతే ఐపీఎల్‌లో ఆడనివ్వమని శ్రీలంక క్రికెటర్లని భారత్‌ బెదిరించినట్లు నాకు కొంత మంది మ్యాచ్ కామెంటేటర్లు చెప్పారు. ఇది నిజంగా హేయమైన.. ఉన్మాద చర్య అంటూ వ్యాఖ్యలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -