Saturday, April 20, 2024
- Advertisement -

టెస్టుల్లో సచిన్ సరసన చోటు సంపాదించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్

- Advertisement -

టెస్టుల్లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ సిక్సర్లలో సచిన్ టెండుల్కర్ రికార్డును సమయం చేశారు. శ్రీలంకతో గాలే వేదికగా తాజాగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న టిమ్ సౌథీ.. ఒక సిక్స్ సాయంతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 200 టెస్టు మ్యాచ్‌లాడిన సచిన్ టెండూల్కర్ 53.79 సగటుతో 15,291 పరుగులు చేశాడు. ఇందులో ఆరు డబుల్ సెంచరీలు, 51 శతకాలు, 68 అర్ధశతకాలు ఉన్నాయి. కాని టెస్టుల్లో మాత్రం 69 సిక్సర్లే కొట్టారు.మరోవైపు 66 టెస్టులాడిన టిమ్ సౌథీ.. 17.98 సగటుతో 1,564 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో ఐదు అర్ధశతకాలు మాత్రమే ఉండగా.. ఈ ఫాస్ట్ బౌలర్ తాజాగా 69 సిక్సర్లతో సచిన్ సరసన నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -