Friday, April 19, 2024
- Advertisement -

స్టార్ క్రికెట‌ర్ రాహుల్ ప్రేమ‌లో నాగ‌చైత‌న్య హీరోయిన్‌.. సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్‌

- Advertisement -

క్రికెటర్లతో బాలీవుడ్‌ తారల మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న కోహ్లీ-అనుష్కలు గత ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇప్పుడు తాజాగా మరో జంట గురించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

వాళ్లు ఎవ‌రో కాదు టీమిండియా బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ లు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ముంబైలోని బాంద్రాలో వీరిద్దరూ జంటగా కనిపించినప్పటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇద్దరిలో ఎవరూ ఇంతవరకు స్పందించలేదు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో వరుస విజయాలను నమోదు చేసుకున్న పంజాబ్ ఆ తర్వాత ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేకపోయింది

మరోవైపు, తెలుగులో కూడా నిధి అగర్వాల్ ఓ సినిమా చేస్తోంది. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’ చిత్రంలో ఆమే హీరోయిన్. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -