Friday, March 29, 2024
- Advertisement -

స్మిత్ ,కోహ్లీ బ్యాటింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసినజాంటీ రోడ్స్‌…

- Advertisement -

ప్రస్తుతం స్మిత్, కోహ్లీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రశ్నలకు ఇప్పటికే స్మిత్ కంటె కోహ్లీనే బెస్ట్ అని కితాబిచ్చారు. తాజాగా దీనిపై దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్మిత్ కంటే కోహ్లీనే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని కితాబిచ్చారు. బాల్‌ టాంపరింగ్‌ వివాదం-నిషేధం అనంతరం.. ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

ఇటీవలె ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకిగ్స్ లో కోహ్లీని వెనక్కి నెట్టి స్మిత్ అగ్రస్థానాన్ని ఆక్రమించారు.అదే విధంగా టెస్టు సెంచరీల్లో కూడా కోహ్లి అధిగమించిన సంగతి తెలిసిందే. స్మిత్‌ 937 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.తను చేసిన చెత్త సెంచరీలను తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదన్నాడు. ‘ విరాట్‌ ఆటను ఎంజాయ్‌ చేస్తా. కొంతమంది ఆటను చూస్తే వావ్‌..షాట్‌ ఎంత అద్భుతంగా ఉంది అనాలనిపిస్తుంది. కోహ్లి అదే కోవకు చెందినవాడు. కానీ స్టీవ్‌ స్మిత్‌ తన యాక్షన్‌, టెక్నిక్‌తో చెత్త సెంచరీలు చేశాడంటూ రోడ్స్ వ్యాఖ్యలు చేశారు.కాగా ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల పరంగా చూస్తే తమ దేశ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ కంటే కూడా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినే గ్రేటెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అని ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు షేన్‌ వార్న్‌ ఇప్పటికే అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -