టీమిండియా తదుపరి ధోనీ రోహితే : రైనా

633
suresh raina names rohit sharma as the next ms dhoni of indian cricket
suresh raina names rohit sharma as the next ms dhoni of indian cricket

టీమిండియాకు మాజీ కెఫ్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన కృషి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మూడు ఐసీసీ ట్రోఫీలను టీమిండియాకు అందించాడు. అయితే‌ ధోనీలో ఉన్న షేడ్స్‌ను తాను ఓపెనర్ రోహిత్‌ శర్మలో చూశానని బ్యాట్స్‌మన్‌ సురేశ్ ‌రైనా అన్నారు. టీమిండియాలో రోహిత్ మరో ధోనీ లాంటివాడని ప్రశంసలు కురిపించాడు.

తాజాగా సురేష్ రైనా ‘ది సూపర్ ఓవర్ పోడ్‌కాస్ట్‌ ‘ఎపిసోడ్‌లో భాగంగా సౌతాఫ్రికా క్రికెటర్‌ జేపీ డుమినితో మాట్లాడుతూ… ’రోహిత్ కామ్ గా ఉంటూ.. ఎదుటి వాళ్లు చెప్పేది ఎంతో ఓపికగా వింటాడు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. కెప్టెన్‌గా ఉన్నా డ్రెస్సింగ్‌ రూంలో అందరినీ గౌరవిస్తాడు. ప్రతీ ఒక్కరు కెప్టెన్ ‌లాంటి వాళ్లే కదా అంటాడు. మేము బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ గెలిచినప్పుడు నేను రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడాను. అప్పుడు అతన్ని దగ్గరగా గమనించాను.

షార్దుల్ ఠాకూర్, వాషింగ్‌టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్ వంటి యువ ఆటగాళ్లపై అతడు ఎలా విశ్వాసం చూపుతాడో నేను చూశాను. నాకు తెలిసి టీమిండియా తదుపరి ధోనీ ఎవరైన ఉన్నారా అంటే రోహిత్ పేరే చెబుతాను. మహిలాగే రోహిత్ నాకు కనిపిస్తాడు. తనలాగే ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచాడు. జట్టు సారథులుగా వాళ్లలో ఎన్నో సారూప్యతలను నేను చూశాను. సమస్యలు పరిష్కరించే తీరు గమనించాను. అందుకే నా పుస్తకంలో వారిద్దరిని అద్భుతమైన వ్యక్తులుగా అభివర్ణించాను ’ అని రైనా చెప్పుకొచ్చాడు.

ఇక అంతర్జాతీయ కెరీర్‌లో రైనా ఇప్పటివరకు 18 టెస్టుల్లో, 226 వన్డేల్లో, 78 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు రోహిత్ 32 టెస్టుల్లో, 224 వన్డేల్లో, 108 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

సెహ్వాగ్‌ లాగా రోహిత్ రాణించగలడా ? సందేహమే : ఇర్ఫాన్ పఠాన్

రిషబ్ పంత్‌ రాణించాలంటే కోహ్లీ ఇలా చేయాలి : పఠాన్

సచిన్‌ సలహా వల్లే ఉత్తమ టెస్టు క్రికెటర్ అయ్యాను : కోహ్లీ

టీమిండియాలోకి ధోనీ మళ్లీ ఎంట్రీ ఇవ్వాలంటే ఇదొక్కటే మార్గమట..!

Loading...