రైనా..తాగడానికి గంజి లేదంటే తినడానికి బిర్యానీ అడిగిందట.. అవసరమా..?

819
suresh raina out ipl with silly reason
suresh raina out ipl with silly reason

ఇటీవలే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ కి కూడా దూరమైనా సంగతి తెలిసిందే.. కరోనా కారణంగా ఈ సారి వేసవికాలంలో జరగాల్సిన ఐపీఎల్ ఆలస్యంగా   జరుగుతుంది.. దీనికి అన్ని జట్ల సభ్యులు కోవిడ్ నిభందనలను అనుసరించానున్నారు..ఇప్పటికే అన్ని జట్లు దీనికోసం యుఏఈ  కి వెళ్లి అక్కడ 15 క్వారంటైన్ లో కూడా ఉన్నాయట.. ఇక ఈ మెగా టోర్నీ కి 20 రోజులే ఉండడంతో క్రిదాభిమనులు ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు..

ఇక చాలా రోజులుగా క్రికెట్ చూడకుండా ఉన్నవాళ్ళకు ఐపీఎల్ రూపంలో క్రికెట్ ఫీస్ట్ రెడీ గా ఉనారు.. ఇంతలోనే చెన్నై సూపర్ కింగ్స్ లో కరోనా కలకలం అందరిని కలిచివేసింది.. ఓ దశలో ఈ మెగా టోర్నీ ఉంటుందా అని భయపడ్డారు కూడా అయితే అది సద్దుమనగడంతో అందరు ఆనందపడ్డారు.. ఇంతరలోనే సురేష్ రైనా వెనక్కి వచ్చేయడం చెన్నై అభిమానులను కలవరపరిచింది.. అయితే దీని వెనుక ఉన్న కారణాలు రకరకాలుగా చెప్పినా అసలు కారణం వేరే ఉందట..ఆయన బంధువులపై దాడి జరిగిందని ఓ సారి.. పిల్లల కోసమని ఇంకో సారి చెప్పుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దుబాయ్‌లో రైనా కోసం కేటాయించిన హోటల్‌రూమ్‌కి బాల్కనీ లేదట. దీంతో…ఆయన టీమ్ మేనేజ్‌మెంట్‌తో గొడవపడ్డారు.  దాంతో యాజమాన్యం తీరు నచ్చక ఆయన వెనక్కి వచ్చారని తెలుస్తుంది. ధోనీకి లగ్జరీ రూమ్.. బాల్కనీ ఉన్న రూమ్ కేటాయించడంతో తనకీ అలాంటి రూమే కావాలని పట్టుబట్టారట. అయితే.. సాధ్యం కాదని చెప్పడంతో.. రైనా ధోనీతో కూడా గొడవపడి… ఐపీఎల్ నుంచి ఆడకుండా వెనక్కి రావాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. రైనాకు ఆప్తమిత్రుడిగా భావించే ధోనీ కూడా… మందలించారని చెబుతున్నారు.ఈ ఘటన కలకలం రేపడంతో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్.. స్పందించారు. కొన్ని సార్లు విజయాలు నెత్తికెక్కుతాయని.. ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చని నేరుగా చెప్పేశారు. అయితే వెనక్కి వెళ్ళిన రైనా అలా వెళ్ళడంతో పదకొండు కోట్లు నష్ట పోయాడని అంచనా..

Loading...