ధోనీ నాకు వార్నింగ్ ఇచ్చాడు : సురేశ్ రైనా

808
Suresh Raina Responds To Yuvraj Singh’s ‘Ms Dhoni’s Favourite Player’ Comment
Suresh Raina Responds To Yuvraj Singh’s ‘Ms Dhoni’s Favourite Player’ Comment

రెండు వారాల క్రింద మహేంద్రసింగ్ ధోనీపై యువరాజ్ సింగ్ చేసిన విమర్శ సంచలనం రేపింది. అదేంటంటే “ధోనీ ఫేవరెట్ ప్లేయర్ సురేశ్ రైనా. అప్పట్లో రైనాకు ధోనీ మద్దతు చాలా ఉండేది. 2011 వన్డే ప్రపంచకప్ లోనూ నా స్థానంలో రైనాని ఆడించేందుకు ధోనీ ప్రయత్నించాడు” అని యువీ విమర్శ చేశాడు. దాంతో యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ కూడా ఓ నాలుగు రోజుల పాటు ధోనీపై పెద్ద ఎత్తున నిప్పులు చెరిగాడు.

యూవరాజ్ కెరీర్ ను ధోనీ నాశనం చేశాడని మండిపడ్డాడు. కానీ విషయంపై మాత్రం ధోనీ స్పందించలేదు. అయితే తాజాగా సురేష్ రైనా యువీ కామెంట్స్ పై వివరణ ఇచ్చాడు. “ధోని మద్దతు నాకు ఉండేది. ఇది నిజమే. నాలో టాలెంట్ ఉందని అతను విశ్వసించాడు. ఇదే ఇక్కడ కారణం. ధోనీ సపోర్ట్ చేసి ప్రతిసారి మంచి ప్రదర్శన కనబర్చాను. ఒకవేళ నేను ఓ రెండు మ్యాచ్ ల్లో విఫలమైతే ? ధోనీ నుంచి నాకు వార్నింగ్ వచ్చేది.

’నువ్వు స్కోర్ చేయకపోతే ? కెఫ్టెన్ గా నేను కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’ అని ధోని అనేవాడు. ఆ టైంలో ప్లీజ్ ఓ రెండు అవకాశాలివ్వవా ? మళ్లీ ఆ తప్పులు చేయను అని కోరేవాడ్ని” అని సురేశ్ రైనా చెప్పాడు. ధోనీ కెఫ్టెన్ గా ఉన్న రోజులు టీమిండియాలో రైనా, జడేజాకి చోటూ విషయంలో ఢోకా ఉండేది కాదు. కానీ 2017లో ధోనీ కెఫ్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోగా.. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన రైనా.. గత రెండేళ్లుగా పునరాగమనం కోసం నిరీక్షిస్తున్నాడు. జడేజా మాత్రం రెగ్యులర్ ఆటగాడిగా ఇప్పటికి కొనసాగుతున్నాడు.

Loading...