రిటైర్మెంట్ తర్వాత ధోనీ, నేను వెక్కివెక్కి ఏడ్చాం : రైనా

1228
suresh raina says ms dhoni and i hugged and cried a lot after announcing retirement
suresh raina says ms dhoni and i hugged and cried a lot after announcing retirement

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై వెళ్లగానే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తనకు ముందే తెలుసని వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తెలిపాడు. దానికనుగుణంగానే ఆటకు వీడ్కోలు పలికేందుకు తాను సిద్దమయ్యానన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఇద్దరం ఒకరికొకరం అప్యాయంగా కౌగిలించుకొని కన్నీటి పర్యంతమయ్యామని రైనా చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సహచర ఆటగాళ్లతో తమ రిలేషన్‌షిప్, కెరీర్‌కు సంబంధించిన విషయాలను మాట్లాడుకున్నట్లు దైనిక్ జాగరన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. “చెన్నై చేరుకోగానే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నాకు తెలుసు. దాంతో నేను కూడా సిద్దమయ్యా. మా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇద్దరం ఆప్యాయంగా హగ్ చేసుకున్నాం. వెక్కివెక్కి ఏడ్చాం” అని రైనా చెప్పుకొచ్చాడు.

ధోనీ, తాను దాదాపు ఒకేసారి క్రికెట్‌లో అడుగుపెట్టామని, వీడ్కోలు కూడా కలిసే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రైనా తెలిపాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతామని స్పష్టం చేశాడు. ఆగస్టు 15నే ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించినా.. బీసీసీఐకి మాత్రం వేర్వేరుగా సమాచారమిచ్చాడు. ముందే ధోనీ భారత క్రికెట్ బోర్డుకు తన నిర్ణయాన్ని వెల్లడించగా.. రైనా మాత్రం బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం ఆగస్టు 16 (ఆదివారం)న సమాచారం ఇచ్చాడు.

ధోనీని ఇబ్బంది పెట్టాలనే బీమర్ వేశా : అక్తర్

ధోనీతో నన్ను పోల్చడం నాకు నచ్చలేదు : రోహిత్ శర్మ

ఐపీఎల్ మ్యాచ్‍లు ఆడటం కష్టమే.. అంత ఈజీ కాదు ఇప్పుడు : రోహిత్

టీమిండియా తదుపరి ధోనీ రోహితే : రైనా

Loading...