టీమిండియా ముందు భారీ ల‌క్ష్యం ఉంచిన ఆసీస్‌

283
Team india target 289
Team india target 289

ఆసీస్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్ మొద‌టి మ్యాచ్ టీమిండియా ముందు భారీ ల‌క్ష్యం ఉంచింది అతిథ్య జ‌ట్టు. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్‌. ఆసీస్‌ జట్టులో ఉస్మాన్‌ ఖవాజా(59), షాన్‌ మార్ష్‌(54), హ్యాండ్ స్కాంబ్‌(73)లు హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో పాటు, మార్కస్‌ స్టోనిస్‌(47 ) బ్యాట్‌తో రాణించారు.

చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు రావడంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోరు చేసింది. . ఆఖరి పది ఓవర్లలో కేవలం వికెట్‌ మాత్రమే తీసిన భారత జట్టు 93 పరుగుల్ని సమర్పించుకుంది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది.