Thursday, April 18, 2024
- Advertisement -

సూపర్ ఓవర్ లో చెలరేగిన రోహిత్.. ఇండియా విన్

- Advertisement -

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య హామిల్టన్ వేదికగా జరిగిన మూడో టి20 టై అయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టుకి ఆదిలో రోహిత్ శర్మ రూపంలో ఇబ్బంది ఎదురైనా ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీం ఇండియా ను భారి స్కోర్ దిశగా వేళ్లింది. భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 6 వికెట్లకు 179 పరుగులే చేసింది.

కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడి 95 పరుగులు చేశాడు. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. కివీస్ నుంచి ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ కెప్టెన్ విలియమ్సన్ బరిలోకి దిగారు. బూమ్రా బౌలింగ్ చేసాడు. ఆరు బంతుల్లో కివీస్ తొలి రెండు బంతులకు రెండు పరుగులు చేయగా.. తర్వాతి బంతికి విలియమ్సన్ సిక్స్, నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. 5 బంతికి లెగ్ బై రాగా ఆరో బంతికి గుప్తిల్ ఫోర్ కొట్టాడు. ఆరు బంతులకు గాను 17 పరుగులు చేశారు. టీం ఇండియా గెలవాలంటే 18 పరుగులు అవసరం. టీం ఇండియా తరుపున బరిలోకి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ దిగారు.

టీం సౌథీ బౌలింగ్ చేసాడు. తొలి బంతికి రెండు పరుగులు రాగా రెండో బంతికి ఒక పరుగు వచ్చింది మూడో బంతికి రాహుల్ ఫోర్ కొట్టాడు నాలుగో బంతికి ఒక పరుగు వచ్చింది. అయిదో బంతికి రోహిత్ సిక్స్.. ఆరో బంతికి కూడా సిక్స్ కొట్టి భారత్ ను గెలిపించాడు. ఈ మ్యాచ్ విజయంతో 5 టి20ల సిరీస్ ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 జనవరి 31న వెల్లింగ్టన్ లో జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -