Friday, April 19, 2024
- Advertisement -

దటీజ్ కోహ్లి…… ఆటతో కాదు…… ఆ రకంగా దేశం పరువు నిలబెట్టాడు….. రియల్ హీరో

- Advertisement -

కపిల్ దేవ్ సారధ్యంలో టీం ఇండియా వరల్డ్ కప్ గెలిచిన దగ్గర నుంచీ……. టీవీ సెట్స్ భారతీయలకు చేరువైనప్పటి నుంచీ క్రికెట్‌కి ఇండియాలో సూపర్ క్రేజ్ రావడం మొదలైంది. ఆ క్రేజ్ పుణ్యమాని క్రికెటర్స్ కూడా కోట్లు వెనకేసుకున్నారు. కానీ ఆట కంటే కూడా ఇండియానే గొప్ప అనే స్థాయిలో హీరోయిజం చూపించిన క్రికెటర్స్ మాత్రం మన దగ్గర చాలా చాలా తక్కువ. అవమానిస్తున్నా కూడా మౌనంగా ఉండి మంచి పేరు తెచ్చుకోవడం, భరించడం లాంటివే ఎక్కువ మంది ఇండియన్ క్రికెటర్స్ లక్షణాలు. అలాగే ట్యాక్స్ ఎగ్గొట్టడాలు లాంటి విషయాల్లో క్రికెట్ దేవుడు అని అనిపించుకున్న టెండూల్కర్ పేరు రావడం అయితే చాలా మందిని బాధించింది. క్రికెట్ అంటే కేవలం కాసుల కోసమే అని భావించేలా చేసింది. ఇక ఫిక్సింగ్ వ్యవహారాలు అయితే చెప్పనవసరం లేదు. అయితే సౌరవ్ గంగూలీ లాంటి వాళ్ళు మాత్రం భారతీయ క్రికెటర్స్ పట్ల అంతర్జాతీయంగా ఉన్న పేరుని మార్చేశారు. ఇండియన్స్ అంటే అణిగిమణిగి ఉండేవాళ్ళు కాదు…..అవమానాలు ఎదుర్కుంటూ భరించే రకం కాదు…….అవసరమైతే ……ఇండియా వరకూ వస్తే ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు అని నిరూపించాడు. అఫ్కోర్స్……అంతర్జాతీయ క్రికెటర్స్ నుంచి…….మరీ ముఖ్యంగా ఆసియేతర క్రికెటర్స్ నుంచి వేరే ఇతర ఇండియన్ క్రికెటర్ కూడా ఎదుర్కోనన్ని విమర్శలు గంగూలీ ఎదుర్కున్నాడు. ఇక ఇండియన్ మీడియాకు, కొంతమంది పెద్దలకు కూడా పడి ఉండేవాళ్ళంటేనే ప్రేమ. చెప్పినమాట వింటారని. అలా కాదని ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం చూపిస్తే వెంటనే విమర్శలు స్టార్ట్ చేస్తారు. ఇండియన్ సమాజంలో కూడా ఆ కల్చర్ బలంగా ఉంటుంది.

వ్యక్తిత్వం పరంగా సౌరవ్ గంగూలీ ఎంత హీరోయిజం చూపించినా, ఆటగాళ్ళలో ఆత్మాభిమానాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నింపి ఇండియన్ క్రికెట్‌కి హీరోయిజం తీసుకొచ్చినా గంగూలీ ఆటలో ఉన్న లోపాలను చాలా మంది హైలైట్ చేశారు. ఇక ఇప్పుడు ఆటలో లోపాలే లేని ఒక పర్ఫెక్ట్ బ్యాట్స్‌మేన్ మన టీంకి దొరికాడు. అన్నింటికీ మించి సౌరవ్ గంగూలీ కంటే ఇంకా ఎక్కువ ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఉన్నవాడు. ఇండియా సగర్వంగా నిలబడాలి…….అన్నీ విజయాలే ఉండాలి……అది కూడా అడుక్కున్నట్టు కాదు……..ఛాంపియన్ తరహాలో హీరోయిక్ ఆటతో విజయాలు ఉండాలి అని తపిస్తున్నాడు కోహ్లి. ఆ లక్షణాలన్నీ కోహ్లికి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చాయి. ఇక ఫిట్నెస్ పరంగా ఇండియన్ యూత్‌కి, ఇండియన్స్‌కి కోహ్లి ఇన్‌స్పిరేషన్ ఐకాన్‌గా నిలబడిపోతున్నాడు. ఇతర ఆటగాళ్ళతోపాటు, అన్ని రకాల క్రీడల్లో ఉన్న ఆటగాళ్ళు, భారతదేశ యువత అంతా కూడా విరాట్ కోహ్లిలా ఫిట్‌గా ఉండాలన్న ఆలోచనలతో ఉండడానికి కారణం కోహ్లినే.

ఆ విషయాలన్నీ పక్కన పెడితే నిన్న శ్రీలంకతో టెస్ట్ సందర్భంగా శ్రీలంక క్రికెటర్స్ ప్రదర్శించిన నీచ రాజకీయానికి మాత్రం విరాట్ కోహ్లి సూపర్ కౌంటర్ ఇచ్చాడు. ఢిల్లీలో పొగమంచు, కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందన్నది నిజం. అయితే మరీ శ్రీలంక క్రికెటర్స్ డ్రామా చేసినంత లేదు. కానీ కోహ్లి డబుల్ సెంచరీ దెబ్బకు ఈ టెస్ట్‌లో శ్రీలంకకు గెలిచే అవకాశాలు పోయాయి. అందుకే డ్రామా ఆడ డ్రా చేయాలన్న ప్రయత్నం చేశారు. ఫీల్డింగ్ చేయడం అసాధ్యం అని నిరూపించాలనుకున్నారు. అప్పటికే చాలా సార్లు అంతరాయం సృష్టించి టైం వేస్ట్ చేశారు. చాలా మంది మైదానం వీడిపోయారు. ఇక గ్రౌండ్‌లో కూడా పదిమంది ఫీల్డర్లే మిగిలారు. ఆ సందర్భంలో శ్రీలంక క్రికెటర్లు అంపైర్స్‌ని కూడా కన్విన్స్ చేశారు. ఆ సమయంలో ఆటను నిలిపివేసే పరిస్థితి. అదే జరిగి ఉంటే అంతర్జాతీయంగా ఇండియా పరువు పోయి ఉండదు. భారతదేశ రాజధానిలో పొగమంచు, పొల్యూషన్ బ్రతకలేని స్థాయిలో ఉందన్న మెస్సేజ్ వెళ్ళేది. టూరిజంపై భారీ దెబ్బ పడేది. అయితే కోహ్లి మాత్రం హీరోయిక్‌గా ముందుకొచ్చాడు. డిక్లేరేషన్ డెసిషన్ తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంలోనే తన సంజ్ఙలతో ఓ మెస్సేజ్ కూడా పంపించాడు.

‘శ్రీలంక క్రికెటర్స్ ఫీల్డింగ్ చేయలేని చోట మనం చేద్దాం…….మన సత్తా ఏంటో చెప్దాం…….ఫీల్డింగ్‌కి అనుకూలంగా లేదన్న శ్రీలంక క్రికెటర్స్ మాటలు తప్పని నిరూపిద్దాం……’

అని చెప్పి కెమేరాల సాక్షిగా డిక్లేరేషన్ సందర్భంగా కోహ్లి ప్రకటించాడు. స్టేడియంలో ఉన్న ఇరవై వేల మంది ప్రేక్షకులతో పాటు టీవీ సెట్స్ ముందున్న ప్రేక్షకులు ఇండియన్ క్రికెట్ బోర్డ్……మొత్తంగా ఇండియానే గర్వపడేలా చేశాడు కోహ్లి. పొగమంచు, కాలుష్యం అని చెప్పి డ్రామా ఆడాలనుకున్న లంకను క్రికెట్ సమాజం ముందు దోషిగా నిలబెట్టాడు. కోహ్లి డిక్లేరేషన్ నిర్ణయం తర్వాత లంక క్రికెటర్స్ డిక్కెలా, సండకన్‌లతో పాటు మిగతవాళ్ళు కూడా నవ్వుతూ ప్రదర్శించిన హావభావాలు కోహ్లి పరుగుల ప్రవాహం దెబ్బకు జడిసే వాళ్ళు కావాలనే డ్రామా ఆడారన్న విషయాన్ని నిరూపించాయి. ‘తమ వైఫల్యంతో ముఖం చూపించలేక మాస్క్‌లు వేసుకున్నారని……శ్రీలంక క్రికెటర్స్ నటను ఆస్కార్ ఇవ్వాలి’ అని అంటూ సెహ్వాగ్ లాంటి వాళ్ళు వేసిన కౌంటర్స్‌తో శ్రీలంక పరువుపోయింది. ఆ రకంగా గెలుపు, ఓటములు, ఆటను పక్కన పెట్టి దేశం కోసం కోహ్లి తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీ వాతావరణాన్ని దోషిగా నిలబెట్టాలన్న లంక డ్రామా దెబ్బకొట్టి ఇప్పుడు లంకనే దోషిగా నిలబడింది. భారతదేశం సగర్వంగా నిలబడింది. అందుకే కోహ్లి హీరోయిజానికి హ్యాట్సాఫ్……

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -