Friday, April 19, 2024
- Advertisement -

విరాట్ కోహ్లీ ఎక్కువ సార్లు ఔట్‌ చేసిన బౌలర్ ఎవరంటే ?

- Advertisement -

భారత జట్టు కెఫ్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల రారాజుగా పేరు సంపాధించుకున్నాడు. ఏ ఫార్మాట్ అయిన సరే పరుగుల వర్షం కూరవాల్సిందే. ఎంతో మంది దిగ్గజాల రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడు. అయితే విరాట్ కోహ్లీ ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే అతడి వికెట్ తీయడం ఎంతటి బౌలర్ కైన చాలా కష్టం.

అలాంటి కోహ్లీ న్యూజిలాండ్‌ పేసర్ టిమ్‌ సౌతీ బౌలింగ్‌లో ఎక్కువసార్లు పెవిలియన్ చేరాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి ఏకంగా 9 సార్లు సౌతీకే చిక్కడం విశేషం. శనివారం ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో విరాట్‌ కోహ్లీ (15) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. సౌతీ వేసిన 10 ఓవర్‌ నాలుగో బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. తాజా ఔట్‌తో అన్ని ఫార్మాట్లలో కలిపి టీమ్ సౌతీకే విరాట్ కోహ్లీ ఎక్కువ సార్లు వికెట్‌ను సమర్పించుకున్నాడు.

అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీని సౌతీ 9సార్లు ఔట్‌ చేసాడు. జేమ్స్ అండర్సన్‌, గ్రేమ్‌ స్వాన్‌లు తలో 8సార్లు కోహ్లీని ఔట్‌ చేశారు. ఇక ఆడమ్ జంపా, రవి రాంపాల్‌, మోర్నీ మోర్కెల్‌లు ఏడేసి సార్లు కోహ్లీని పెవిలియన్‌కు పంపారు. కోహ్లీని ఎక్కువసార్లు ఔట్‌ చేసిన ఘనత మాత్రం సౌతీకే దక్కింది. ఇక రెండో వన్డేలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-0తో ఉంది.

ఎక్కువసార్లు సౌతీకే వికెట్:

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -