కోహ్లీ తాగే నీరు ఒక్క లీటర్ ఎంతో తెలుసా ?

2932
Truth Behind Virat kohli's Drinking Water
Truth Behind Virat kohli's Drinking Water

మంచి నీటి సమస్య మన దేశం లో ఇప్పటికి ఉంది. ఇంకా చాలా ఊర్లల్లో నీటి కోసం కొన్ని కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకుంటారు. మంచి నీరు లభించక దొరికిన నీళ్ళు తాగి ఎంతో మంది అనోరోగ్య బారిన పడుతున్నారు. ఇది ఇలా ఉంటే అత్యంత ఖరీదైన వాటరు తాగే వ్యక్తి మన దేశంలో ఉన్నాడు. ఆయన ఎవరో కాదు విరాట్ కోహ్లీ. విరాట్‌ కోహ్లీ తాగే ఇవియన్‌ బ్రాండ్‌ వాటర్‌ బాటిల్‌ ఒక లీటరు ఖరీదు దాదాపుగా 1500 రూపాయలు.

పశ్చిమ యూరప్‌లో ఇవియన్‌ అనే ఒక ప్రాంతంలో మంచి నీటి సరసు ఉంది. ఆ సరస్సులో ఉండే నీరు సహజసిద్దమైన మినరల్స్ ను కలిగి ఉంటాయి. మాములుగా మనం తాగే నీటిని శుద్ది చేసి… మినరల్స్ ను కలిపి తర్వాత మనం తాగుతాం . కానీ ఇవియన్ ప్రాంతంలో ఉండే ఆ నీరు సహజంగానే శుద్దంగా ఉంటాయి. అంతేకాదు ఆ నీటిలో ఆరోగ్యంను అందించే మినరల్స్ చాలానే ఉంటాయి. 1789లో మార్కిన్‌ అనే వ్యక్తి ప్రతి రోజు వృతిరీత్యా ఆ సరసు దాటి అవతల ఒడ్డున ఉన్న చోటుకు వెళ్లాల్సి వచ్చేది.

అలా కొన్నాళ్లు అతడి ప్రయాణం సాగింది. ఆ ప్రయాణంకు ముందు కిడ్నీ సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఆయనకు ఉండేవి. ప్రతి రోజు సరస్సులో ప్రయాణించే టైంలో ఆ నీటిని కాస్త తాగేవాడు. కొన్ని రోజులకు తన ఆరోగ్య సమస్యలు అన్ని పోయాయి. ఈ విషయంను ప్రభుత్వంకు తెలియజేయడంతో ఆ నీటిని టెస్టులు చేయించింది ప్రభుత్వం. నిజంగానే ఆ నీటిలో అద్బుతమైన ఔషద గుణాలు ఉన్నాయని తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే ఆధీనంలోకి తీసుకుంది.

దాంతో ఇవియన్‌ నీరు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన నీరుగా పేరు పెందాయి. ఇప్పుడు ఈ నీటినే కోహ్లీ తాగుతున్నాడు. ప్రతి రోజు కోహ్లీ మంచి నీళ్ల కోసం అయిదు వేల నుండి ఆరు వేల రూపాయలు ఖర్చు చేస్తాడని తెలుస్తోంది. ఆయన ఆరోగ్య సమస్యలు లేకుండా హెల్తీగా ఉండటానికి కారణం ఇవియన్‌ వాటర్‌ చెప్పుకోవచ్చు.

Loading...