ఐపీఎల్ 2020 తర్వాత రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన హర్భజన్..!

799
veteran Indian Cricketer Harbhajan Singh Reveals Whether He Will Retire After Ipl 2020
veteran Indian Cricketer Harbhajan Singh Reveals Whether He Will Retire After Ipl 2020

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. నాలుగేళ్ళ నుండి భారత్ టీంకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో మాత్రం రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నారు. రెండేళ్ల క్రితం ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ అతడ్ని వదులుకున్నా.. చెన్నై సూపర్ కింగ్స్ అక్కున చేర్చుకుంది. 2019 ఐపీఎల్ 11 మ్యాచ్‌లాడిన భజ్జీ 16 వికెట్లు పడగొట్టాడు.

అయితే ఇటీవలే 40 లోకి అడుగుపెట్టిన హర్భజన్ సింగ్.. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై భజ్జీ ఓ ఇంటర్వ్యూలో జవాబు ఇచ్చారు. ” నా బౌలింగ్ సామార్ధ్యాన్ని ఇప్పటికీ పరీక్షించాలనుకుంటున్నారా ? నేను సిద్దం. ఈ మధ్యకాలంలో మంచిగా రాణిస్తున్న యువ స్పిన్నర్ తో పోటీకి నేను రెడీ. చాలా రోజుల నుండి టీమిండియాకు దూరంగా ఉంటున్నా. కానీ నాకు ఎవరి జాలి అక్కర్లేదు. నేను ఇప్పటికి టీమిండియా తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలను. ఇక ఐపీఎల్ 2020 నేను ఆడే ఆఖరి టోర్నీ అని చెప్పలేను.

అది నా శరీరం సహకరించే తీరును బట్టి ఉంటుంది. గత నాలుగు నెలలుగా నా బాడీకి పూర్తిగా విశ్రాంతి దొరికింది. అలానే రెగ్యులర్ గా యోగా చేశాను. దాంతో.. 2013 నాటి ఉత్సాహం ఇప్పుడు నాలో కనిపిస్తోంది. ఆ ఐపీఎల్ సీజన్‌లో నేను 24 వికెట్లు పడగొట్టాను’’ అని హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. భారత్‌ తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లాడిన హర్భజన్ సింగ్.. మొత్తం 711 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌లాడి.. 150 వికెట్లు పడగొట్టాడు.

రోహిత్ శర్మని ఔట్ చేయడం నా కల : పాక్ ఫేసర్

లీడర్ అంటే ధోనీనే.. అందుకు అసలైన సాక్ష్యం ఇదే : మాజీ కోచ్ గ్యారీ…

సర్వేలో గంగూలీని ఓడించిన ధోనీ.. ఎంత తేడాతో అంటే ?

గంగూలీ, ధోనీ కెప్టెన్సీలో తేడా చెప్పిన గ్రేమ్ స్మిత్..!

Loading...