ఒకే మ్యాచ్ లో రెండు రికార్డులు సాధించిన కోహ్లీ..!

1768
Virat Kohli becomes first Indian to slam 7 double hundreds
Virat Kohli becomes first Indian to slam 7 double hundreds

పరుగులకే రారాజుగా పేరు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఆయన ఖాతలో మరో రికార్డు వచ్చి చేరింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేశాడు. ఇది కోహ్లీకి ఎడవ డబుల్ సెంచరీ. తద్వారా భారత్ తరుపున ఎక్కువ డబుల్ సెంచరీలు సాధిమ్చిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డు సాధించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది.

సెహ్వగ్ ఆరు డబుల్ సెంచరీలు సాధించాడు. అంతేకాకుండా ప్రపంచ క్రికెట్ లో ఎక్కువ డబుల్ సెంచీల జాబితాలో నాల్గోస్థానంలో కోహ్లీ ఉన్నాడు. కేవలం 81 టెస్టుల్లోనే ఈ రికార్డు సాధించాడు. ఇక ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆసీస్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ (52 టెస్టులు) ఉన్నాడు. డాన్ ఖాతాలో 12 డబుల్స్ ఉన్నాయి.

ఆ తర్వాత శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కరటెస్టులు (134 టెస్టులు) 11 ద్విశతకాలతో రెండో స్థానంలో, 9 డబుల్ సెంచరీలతో వెస్టిండీస్ బ్యాటింగ్ కింగ్ బ్రియాన్ లారాటెస్టులు (131) మూడో స్థానంలో ఉన్నారు. ఇక మరో రికార్డు కూడా తన ఖాతలో వేసుకున్నాడు. టెస్టుల్లో 7000 పరుగులు సాధించాడు.

Loading...