Thursday, April 25, 2024
- Advertisement -

మరో భారీ సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్న కోహ్లీ

- Advertisement -

టీమిండియా కెప్టెన్ పరుగుల మిషన్ కోహ్లీ మరో భారీ రికార్డుపై కన్నేశాడు. ఇప్పటికే అనేక రికార్డులు తన పేరున లిఖించకున్న కోహ్లీ మరో సారి సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టనున్నారు.అంతర్జాతీయ క్రికెట్‌లో 21వేల పరుగుల మార్కును వేగవంతంగా చేరేందుకు కోహ్లి స్వల్ప దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ రికార్డును బ్రేక్ చేసె అవకాశం కోహ్లీకి వచ్చింది.

సచిన్‌ టెండూల్కర్‌ 21వేల అంతర్జాతీయ పరుగుల్ని 473 ఇన్నింగ్స్‌ల్లో సాధించి ఆ ఫీట్‌ను వేగవంతంగా నమోదు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కోహ్లీ దాన్ని బీట్ చేయడానికి కేవలం 281 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ ఆడిన అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు 432 కాగా, సాధించిన పరుగులు 20, 719.ఇంకా 41 ఇన్నింగ్స్‌ల్లో దీన్ని చేరినా ఆ రికార్డు కోహ్లి పేరిట లిఖించబడుతుంది. ఈ జాబితాలో సచిన్‌ తర్వాత స్థానంలో వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారా( 485 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు.దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి రాణిస్తే, ఇక్కడే ఆ ఫీట్‌ను సాధించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -