Friday, April 19, 2024
- Advertisement -

ప్ర‌పంచ రికార్డ్‌ను నెల‌కొల్పిన విరాట్ కోహ్లీ…లారా, స‌చిన్ రికార్డులు బ్లాస్ట్‌

- Advertisement -

రాట్ కోహ్లీ అంటేనే రికార్డులు.. రికార్డులు అంటేనే విరాట్ కోహ్లీ. గ్రౌండ్‌లో దిగాడంటే ప‌రుగుల వ‌ర‌ద పార‌డం కాయం. తాజాగా మ‌రో ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు విరాట్‌. ఇవాళ వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 37 పరుగులు చేసి 20 వేల పరుగుల మార్కును కోహ్లీ అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 25 ఓవర్‌లో హోల్డర్‌ బౌలింగ్‌లో నాలుగో బంతికి సింగిల్‌ రాబట్టి.. కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేల పరుగులు పూర్తి చేసిన 12వ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. సచిన్ తెందుల్కర్(34,357), రాహుల్ ద్రవిడ్‌(24,208) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్ కోహ్లీనే కావడం మరో విశేషం.ప్రపంచం మొత్తం మీద చూస్తే ఈ రికార్డు సాధించిన 12 వ ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ ఇప్పటి వరకు 417 ఇన్నింగ్స్ ఆడగా… టెస్టుల్లో 131, వన్డేల్లో 224, టీ20ల్లో 62 ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటి వరకు తక్కువ ఇన్నింగ్స్‌లో 20 వేల పరుగుల మార్కును చేరుకున్న వారిలో సచిన్, బ్రియాన్ లారా మొదటి ప్లేస్‌లో ఉన్నారు. 453 ఇన్నింగ్స్‌లో వాళ్లు ఆ మార్కును చేరుకున్నారు.

మొత్తంగా చూసుకుంటే తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌ మాత్రం కోహ్లీనే. సచిన్‌, లారా 453 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకోగా.. ఆసీస్‌ మాజీ సారథి రికీ పాంటింగ్‌ 468 ఇన్నింగ్స్‌ల్లో దీనికి చేరాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -