Thursday, April 25, 2024
- Advertisement -

కెరీర్‌లో 25వ సెంచ‌రీ చేసిన కోహ్లి

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మ‌రో సెంచ‌రీ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో విరాట్ కోహ్లి సెంచ‌రీ సాధించాడు. 214 బంతుల్లో 11 ఫోర్లతో కోహ్లి కెరీర్‌లో 25వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 25 సెంచరీలు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. 172/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ఆదిలోనే అజింక్యా రహానే (51:105 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ను కోల్పోయింది. అజింక్యా రహానేను స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. రహానే అవుట్ అయిన త‌రువాత క్రీజ‌లోకి తెలుగుతేజం హనుమ విహారితో కోహ్లి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

ఇక కోహ్లి మ‌రో రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నాడు.ఇండియా త‌రుపున త‌క్క‌వ మ్యాచుల‌లో 25 సెంచ‌రీలు పూర్తి చేసుకున్న ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు.76 మ్యాచ్‌లు.. 128 ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఘనత సాధించగా.. దిగ్గజ క్రికెటర్‌ బ్రాడ్‌మన్‌ 52 మ్యాచ్‌లు.. 68 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 130 ఇన్నింగ్స్‌ల్లో.. మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావాస్కర్‌ 138 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకొని కోహ్లి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -