Thursday, April 18, 2024
- Advertisement -

పెళ్లాం పిచ్చోడు అవుతున్న విరాట్ కోహ్లీ

- Advertisement -

భార్య కోసం కొంద‌రు భ‌ర్త‌లు ఏదైనా చేయ‌డానికి రెడీ అవుతుంటారు. భార్య మీద ప్రేమ వాళ్ల‌ని ఎంత‌టి ప‌ని అయిన చేయ‌డానికి రెడీ అవుతుంటారు. ఇలాంటీ వాళ్ల‌ను స‌మాజంలో పెళ్లాం పిచ్చోళ్ల‌ని అంటుంటారు. తాజాగా టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విష‌యంలో కూడా ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీకి త‌న భార్య అంటే చాలా ఇష్టం. బాలీవుడ్ హీరోయిన్ అయిన అనుష్క శ‌ర్మ‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విరాట్‌. ఎక్క‌డికి వెళ్లిన భార్య‌తోనే క‌లిసి వెళ్తుంటాడు విరాట్‌.

చివ‌రికి క్రికెట్ మైదానంలో కూడా అనుష్క ఉండాల్సిందే. ఈ రోజు (మే 1) అనుష్క పుట్టిన రోజు కావ‌డంతో ఏదైనా స్పెషల్ గా చేయాలి అనుకున్నాడు విరాట్. అనుష్కకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు బెంగళూరులోని ఒక రెస్టారెంట్ మొత్తం బుక్ చేశాడు. ఆ రెస్టారెంట్ ని అనుష్కకు ఇష్టమైన కలర్స్ – ఫ్లవర్స్ తో అందంగా డెకరేట్ చేయించాడు.

అనుష్కని ఈ రెస్టారెంట్ కు తీసుకువచ్చి విలువైన బహుమతులతో.. ఆమె జీవితంలో మర్చిపోలేని రోజుగా మార్చాలని ప్లాన్ చేశాడు. ఇది చూసిన చాలామంది విరాట్‌లా డ‌బ్బులు ఉంటే ఏదైన చేయ‌వ‌చ్చ‌ని చ‌ర్చించుకుంటున్నారు. కానీ విరాట్ మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. విమర్శలు వస్తున్నప్పుడు తాను ఇంకా గట్టిగా ఉంటానంటూ చెప్పుకొస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -