Friday, March 29, 2024
- Advertisement -

కోహ్లీ ఆధిప‌త్యానికి చెక్ పెట్టిన బీసీసీఐ….

- Advertisement -

టీమిండియా జ‌ట్టు కోచ్ ఎంపిక విష‌యంలో కెప్టెన్ కోహ్లీకి బీసీసీఐ చెక్ పెట్టింది. ఇన్నాల్లు కోహ్లీ ఆడిందే ఆట‌గా పాడిందే పాట‌గా ఉండేది. కాని ఇప్పుడు ప‌రిస్థితులు అనుకూలంగా లేవు. ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్ చేతిలో భార‌త్ ఓడిపోవ‌డంతో దాని ప్ర‌భావం కోచ్‌పై ప‌డింది. జట్టు హెడ్‌ కోచ్ ఎంపికలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్ర ఇకపై ఏమాత్రం ఉండబోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు స్పష్టం చేశారు.

2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో భేదాభిప్రాయాల కారణంగా కోచ్‌ పదవి నుంచి అనిల్ కుంబ్లే త‌ప్పుకున్నారు. ఆత‌ర్వాత కోచ్ విష‌యంలో కోహ్లీనె కీల‌క పాత్ర పోషించారు.బీసీసీఐ కోహ్లీ ఇష్టానికె సుముఖుత వ్య‌క్తం చేసింది. జ‌ట్టులో మరోసారి కోచ్, కెప్టెన్ మధ్య సమన్వయలోపం ఉండకూడదనే ఉద్దేశంతో కోహ్లీ మద్దతిచ్చిన రవిశాస్త్రినే హెడ్‌కోచ్‌గా అప్పట్లో క్రికెల్ సలహా కమిటీ ప్రతిపాదించగా.. బీసీసీఐ కూడా ఆమోద ముద్ర వేసింది.

ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓట‌మి ప్ర‌భావం అదే విధంగా ర‌విశాస్త్రి కోచ్ ప‌ద‌వి ముగియ‌డంతో కొత్త కోచ్‌, ఇత‌ర స‌హాయ సిబ్బంది నియామ‌కానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది బీసీసీఐ. ఈసారి కోచ్ ఎంపిక కోహ్లీ మద్దతుపై ఆధారపడి ఉండదని తెలుస్తోంది. వరల్డ్‌కప్‌‌లో ఓటమి తర్వాత భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి.. ఓపెనర్ రోహిత్ శర్మకి పగ్గాలు అప్పగించాలని క్రికెట్ బోర్డు భావిస్తున్న సంగ‌తి తెలిసిందే.

టీమిండియా ప్రధాన కోచ్ ఎంపికని ఈసారి క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) తమ పర్యవేక్షణలోని అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. అడ్‌హక్ కమిటీలో దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామి ఉన్నారు. ఈ క‌మిటీనె కొత్త కోచ్‌ను ఎంపిక చేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -