టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన కోహ్లీ.. నెం.1 అంతే..!

1430
virat kohli retains top spot and babar azam achieves career best rank
virat kohli retains top spot and babar azam achieves career best rank

ఐసీసీ మంగళవారం టెస్టు ర్యాంకింగ్స్‌ ని ప్రకటించింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన నెం.1 స్థానాన్ని ఉన్నాడు.బ్యాట్స్‌మెన్ జాబితాలో విరాట్ కోహ్లీ 928 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌స్మిత్ (911), మార్కస్ లబుషేన్ (827) టాప్-3లో నిలిచారు.

ఇక బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ బాదిన పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ రెండు స్థానాలు పైకి ఎగబాకి 800 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఇక కోహ్లీతో పాటు భారత్ నుంచి చతేశర్వర్ పుజారా (7వ స్థానం), అజింక్య రహానె (9వ స్థానం) టాప్-10లో చోటు దక్కించుకున్నారు.

భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 21 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ కనీసం ఒక సెంచరీ సాధించినా.. అగ్రస్థానం మరింత పదిలం కానుంది. ఇక వైస్ కెప్టెన్ అజింక్య రహానె కూడా ఇటీవల న్యూజిలాండ్-ఎ టీమ్‌తో జరిగిన అనధికార టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా 814 పాయింట్లతో ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉన్నాడు.

Loading...