ధోనీ కారణంగానే కోహ్లీ పేరు ఫేమస్ అయిందట..!

892
virat kohli reveals real story behind chiku nickname
virat kohli reveals real story behind chiku nickname

భారత మాజీ కెఫ్టెమ్ మహేంద్ర సింగ్ ధోనీ కారణంగానే తన పేరు బాగా ఫేమస్ అయిందని కెఫ్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. అదేంటి ధోనీ వల్ల కోహ్లీ ఫేమస్ కావడం ఏంటి అనుకుంటున్నారా ? అయితే ఇది చదవాల్సిందే. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా ఇంట్లో ఖాళీగా సమయంను గడుపుతున్న క్రికెటర్లను ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలో కోహ్లీ ఆసక్తికర విషయం చెప్పాడు. కోహ్లీకి చికు అనే ముద్దు పేరు ఉంది. ఈ విషయం కోహ్లీ ఫ్యాన్స్ కి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే.. రంజీ ట్రోఫీ ఆడే టైంలో కోహ్లీకి అతని కోచ్ ఆ పేరు పెట్టాడు.

చిన్నతనంలో తనకు బుగ్గలు బాగుండేవని.. అందుకే చంపక్ అనే ఓ కార్టూన్ పేరుని తనకు చీకు అని పెట్టాడని కోహ్లీ వివరించాడు. . ఆ పేరు చాలా కొద్ది మందికే తెలుసని.. కానీ ధోనీ కారణంగానే ఆ పేరు అందరికీ తెలిసిందని చెప్పాడు. ఓ రోజు వికెట్ వెనకాల ఉన్న సమయంలో తనను ధోనీ చికు అని పిలిచాడని.. అలా తన పేరు అందరికీ తెలిసి ఫేమస్ అయ్యిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Loading...