ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్‌సీబీతో : విరాట్ కోహ్లీ

789
virat kohli says will never leave rcb
virat kohli says will never leave rcb

ఐపీఎల్ ఆడినంత కాలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‍సీబీ) తరపునే ఆడుతానని టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. బెంగళూరు జట్టు వెళ్లే ఆలోచన లేదన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ఇద్దరూ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

ఇన్‍స్టాగ్రామ్ లైవ్ లో కోహ్లీ మాట్లాడుతూ.. ’ఆర్‌సీబీతో ప్రయాణం బాగుంది. ఐపీఎల్ కప్ సాధించడం మా కల. అయితే సీజన్ లో సరిగ్గా రాణించలేదనే బాధ ఉంది. కానీ బెంగళూరు ను వదిలి వెళ్లే ఆలోచన అయితే లేదు. ఈ జట్టును వదిలే ప్రసక్తి లేదు. అభిమానులు చూపే ప్రేమ ఎప్పటికీ మరచిపోను. ఇక ఐపీఎల్ కి వచ్చే యువ ఆటగాళ్లు పరుగుల వరద పారించాలని” కోహ్లీ అన్నారు.

ఇక అనుష్క శర్మ గురించి కోహ్లీ చెబుతూ.. ఆమె వల్ల నేను చాలా మారిపోయాను. గతంలో ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ధోరణి మారింది. అనుష్క నాలో శాంత‌న్ని నింపింద‌నుకుంటా. అనుష్క వ్యక్తిత్వం, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆమె ప్రశాంతంగా ఉండడం నిజంగా నన్ను ప్రేరేపించింది అని కోహ్లీ అన్నారు.

Loading...