Thursday, April 25, 2024
- Advertisement -

టీ20ల్లో ధోనీ కెప్టెన్సీ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

- Advertisement -

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసిన అది రికార్డు అవుతునే ఉంది. తాజాగా మరో అద్భుతమైన రికార్డు తన ఖాతలో వేసుకున్నాడు. భారత్ తరుపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా కోహ్లీ తాజాగా అరుదైన రికార్డును అందుకున్నాడు.

న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ (27 బంతుల్లో 38, 2 ఫోర్లు, ఒక సిక్సర్) సత్తాచాటిన విషయం తెలిసిందే. అంతకుముందు భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. తను 72 మ్యాచ్‌ల్లో 1112 పరుగులు చేశాడు. దీంతో ఈ రికార్డును బద్దలకొట్టేందుకు మూడో టీ20కి ముందు మరో 25 పరుగులు చేయాల్సి ఉంది. హామిల్టన్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ పరుగులు సాధించాక రికార్డు అతని ఖాతలో పడిపోయింది.

కేవలం 37 మ్యాచ్‌ల్లోనూ ధోనీని కోహ్లీ దాటడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 1,125 పరుగులు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సౌతాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉంది. తను 40 మ్యాచ్‌ల్లో 1273 పరుగులు చేసి అందరి కంటే ముందు స్థానంల్ ఉన్నాడు. ఇక కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -