కోహ్లీ మరో రికార్డు.. ఇది ఎవరూ ఊహించనిది..!

1804
virat kohli surpasses sourav gangulys feat as a test captain
virat kohli surpasses sourav gangulys feat as a test captain

భారత కెఫ్టెన్ విరాట్ కోహ్లి తన అద్భుతమైన ఆట తీరుతో పాటు తాను తీసుకునే నిర్ణయాలతో సంచనాలను సృష్టిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఒక బ్రాండ్ లాగా ఎప్పటికి అప్పుడు ప్రపంచ క్రికెట్ కు తనకు తాను కొత్తగా అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా, కెఫ్టెన్ గా నిరూపించుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో అద్బుతమైన అర్ద శతకాన్ని పూర్తి చేయడమే కాకుండా.. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ రికార్డుని బద్దలు కొట్టారు విరాట్.

గంగూలీ ఇప్పటివరకు 49 టెస్ట్ మ్యాచ్ లకు సారథ్యం వహించారు. అయితే కోహ్లీకి దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కెఫ్టెన్ గా 50 వ మ్యాచ్. అయితే ధోని 60 టెస్ట్ మ్యాచ్ లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ధోనీ రికార్డును కూడా అలవోకగా విరాట్ కోహ్లి దాటేస్తాడని అభిమానులు, విశ్లేషకులు అంటున్నారు.

ఇక టెస్ట్ మ్యాచ్ ల్లో ఎక్కువ సక్సెస్ రెట్ ఉన్నది కూడా కోహ్లీకే. ఇక టెస్ట్ మ్యాచ్ ల్లో ధోనీ రికార్డును కోహ్లీ ఎప్పుడెప్పుడు అదగమిస్తాడా అని కోహ్లీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Loading...