చహల్ నీ కటింగ్ చూసి మీ కుక్కలు నీ వెంటబడ్డాయనుకుంటా : కోహ్లీ

752
virat kohli trolls yuzvendra chahal for his new hairstyle
virat kohli trolls yuzvendra chahal for his new hairstyle

లెగ్ స్పిన్నర్ చహల్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చహల్‌పై జోకులు పేల్చాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను బీసీసీఐ ట్వీట్ చేసింది. చహల్‌ హెయిర్‌స్టైల్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ.. చహల్.. నీకు హెయిర్ కటింగ్ ఎవరు చేశారు?’అని విరాట్ ప్రశ్నించగా.. ‘మా దీదీ సాయంతో నేనే చేసుకున్నా’అని ఈ లెగ్ స్పిన్నర్ సమాధానమిచ్చాడు.

దీనికి విరాట్ బదులిస్తూ ‘అవునా.. నీ కటింగ్ చూసి మీ కుక్కలు నీ వెంటబడ్డాయనుకుంటా’అని సెటైర్లు పేల్చాడు. దీంతో షోలో పాల్గొన్న పిల్లలతో పాటు అందరూ నవ్వారు. ఇక ఈ లాక్‌డౌన్ కారణంగా చహల్ ఓ జోకర్‌లా మారడని విరాట్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక ఈ లాక్‌డౌన్ సమయంలో గిటార్ ప్లే చేయడం ఎలానో నేర్చుకోవడానికి ప్రయత్నించానని, కానీ తనకు అది రాలేదన్నాడు. ‘గిటార్ ప్లే చేయడం ఎలానో నేర్చుకోవడానికి ప్రయత్నించా.

కానీ అది చాలా చిన్నగా ఉండటంతో సరిగ్గా నేర్చుకోలేకపోయా. మా ఇంట్లో ఉన్న గిటార్ నీసైజ్ అంత ఉంటుంది’అని విరాట్ చహల్‌కు పంచ్ ఇచ్చాడు. ఇక ఈ లాక్‌డౌన్‌లో తను నేర్చుకున్న కొత్త విషయం ఉదయాన్నే వ్యాయమం చేయడమని ఈ హర్యానా స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. ‘నేను కూడా ఓ కొత్త విషయాన్ని నేర్చుకున్నా. ఈ లాక్‌డౌన్ ఉదయం 6.30కే నిద్రలేదచి వర్కౌట్స్ చేస్తున్నా’అని తెలిపాడు.

Loading...