Friday, April 19, 2024
- Advertisement -

కోహ్లీ దూకుడే జట్టుకు బలం….

- Advertisement -

గత రెండు రోజుల క్రితం న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో శతకం సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వన్డే రికార్డును కోహ్లి సవరించిన నేపథ్యంలో సచిన్ స్పందించాడు.

‘అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన నుంచి ఇప్పటి వరకు కోహ్లీలో ఉన్న దూకుడు ఏమాత్రం తగ్గలేదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. కోహ్లీ ఆడిన తొలి మ్యాచ్ లోనే అతనేంటో, అతని దూకుడు ఏంటో తాను గుర్తించానని చెప్పాడు. వాస్తవానికి దూకుడుగా ఉండేవారు అదే స్థాయిలో విమర్శలను కూడా మూటగట్టుకుంటుంటారని, కోహ్లీ విషయంలో కూడా అదే జరుగుతోందని… అయితే, కోహ్లీ దూకుడు టీమిండియాకు బలంగా మారిందని కితాబిచ్చాడు.

అయితే, ఆట విషయంలో అతని దృక్పథం మాత్రం మారిందని సచిన్ తెలిపాడు. వన్డేల్లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్లలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను కోహ్లీ అధిగమించిన సందర్భంగా స‌చిన్ స్పందించారు. వన్డేల్లో పాంటింగ్ 30 సెంచరీలు చేయగా… న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 31వ సెంచరీని నమోదు చేశాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -