Friday, April 19, 2024
- Advertisement -

కోహ్లీ ముందు మ‌రో రెండు రికార్డులు..

- Advertisement -

మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఈ ఏడాది పది సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్ప‌టికె ఎన్నో రికార్డులు కొట్టిన విరాట్‌కు రికార్డుల రారాజుగా పేరుంది. ప్ర‌స్తుతం కోహ్లీ ముందు ఉన్న మ‌రో రెండు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేంద‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఢిల్లీలో డిసెంబరు 2 నుంచి భారత్‌-శ్రీలంక మధ్య చివరి టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్టు గెలిస్తే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంటుంది. ఇప్ప‌టికే టీమిండియా 1-0తో ముందంజ‌లో ఉంది. ఈ విజయంతో టీమిండియా వరుసగా తొమ్మిదో టెస్టు సిరీస్‌ సొంతం చేసుకున్నట్టు అవుతోంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించిన ఏకైక జట్టుగా ఉంది.

దిల్లీలో జరిగే టెస్టులో కోహ్లీ సేన విజయం సాధిస్తే ఆస్ట్రేలియా రికార్డును కోహ్లీ సేన సమం చేయనుంది. 2005-2008 మధ్య ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్‌ల్లో విజయం సాధించింది. లంకతో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ అనంతరం భారత్‌.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జరిగే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటే వరుసగా 10 సిరీస్‌లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్‌ నిలుస్తోంది.

వ్యక్తిగతంగా కోహ్లీ కూడా మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. టెస్టు క్రికెట్లో కోహ్లీ 5వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ టెస్టులో ఆ పరుగులు పూర్తి చేస్తే భారత్‌ తరఫున టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరిన 11వ ఆటగాడు అవుతాడు. ఇప్పటి వరకు కోహ్లీ 62 టెస్టుల్లో 104 ఇన్నింగ్స్‌ల ద్వారా 4,975 పరుగులు సాధించాడు. త్వ‌ర‌లోనె కోహ్లీ ఖాతాలో మ‌రో రికార్డులు చేర‌నున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -